Friday, February 20, 2026
E-PAPER
Homeతాజా వార్తలుసంగారెడ్డిలో భారీగా డ్రగ్స్‌ పట్టివేత

సంగారెడ్డిలో భారీగా డ్రగ్స్‌ పట్టివేత

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : సంగారెడ్డి జిల్లా అమీన్ పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో డ్రగ్స్‌ తరలిస్తున్న ముగ్గురిని ఎస్‌వోటీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. డ్రగ్స్‌ తరలిస్తున్నారనే సమాచారం మేరకు మాదాపూర్‌ ఎస్‌వోటీ పోలీసులు అమీన్‌పూర్‌లోని ఓ మార్బుల్ షాపుపై దాడి చేశారు. నిందితుల వద్ద అక్రమంగా నిల్వవున్న 2.7 కిలోల డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. ముగ్గురు వ్యక్తులను అరెస్ట్ చేసి డ్రగ్స్ పెడలర్స్ తో పాటు డ్రగ్స్‌ను అమీన్ పూర్ పోలీసులకు అప్పగించారు. రాజస్థాన్‌కు చెందిన మరొక వ్యక్తి పరారీలో ఉన్నాడని నిందితుడిని త్వరలో పట్టుకుంటామన్నారు. ఎవరైనా డ్రగ్స్‌ కొనుగోలు చేసినా, విక్రయించినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని సూచించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -