Monday, April 13, 2026
E-PAPER
Homeక్రైమ్బాణసంచా కేంద్రంలో భారీ పేలుడు..60 మంది కార్మికులు..!

బాణసంచా కేంద్రంలో భారీ పేలుడు..60 మంది కార్మికులు..!

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: విరుద్‌నగర్‌ జిల్లాలో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. సాత్తూర్‌ సమీపం మడతుపట్టిలోని ఎక్సెల్ ఫైర్‌వర్క్స్ ఫ్యాక్టరీలో భారీ పేలుడు సంభవించింది. మందుగుండు సామగ్రి పేలడంతో పెద్దఎత్తున మంటలు చెలరేగాయి. ప్రమాద సమయంలో బాణసంచా కేంద్రంలో 60 మంది కార్మికులు ఉన్నట్టు సమాచారం. పలువురికి తీవ్రగాయాలు కాగా.. చాలా మంది కార్మికులు లోపలే ఉన్నట్లు తెలుస్తోంది. కార్మికుల సమాచారం మేరకు పోలీసులు, ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. సహాయక కార్యక్రమాలు ముమ్మరం చేశారు. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఎవరైనా మృతిచెందారా అనే విషయం ఇంకా తెలియరాలేదు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -