నవతెలంగాణ-హైదరాబాద్ : బాణసంచా కర్మాగారంలో భారీ పేలుడు సంభవించింది. ఇద్దరు వర్కర్లు మరణించగా ఐదుగురు గాయపడ్డారు. అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఉత్తరప్రదేశ్‌లోని బారాబంకి జిల్లాలో ఈ సంఘటన జరిగింది. గురువారం మధ్యాహ్నం బాణసంచా కర్మాగారంలో భారీ పేలుడు జరిగింది. పలు కిలోమీటర్ల దూరం వరకు పేలుడు శబ్ధం వినిపించింది. దీంతో స్థానికులు భయాందోళన చెందారు.
కాగా, ఫైర్‌క్రాకర్స్ ఫ్యాక్టరీలో పని చేస్తున్న కార్మికుల్లో ఇద్దరు మరణించారు. మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ సమాచారం తెలిసిన వెంటనే పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది అక్కడకు చేరుకున్నారు. మంటలను అదుపు చేశారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
మరోవైపు బాణసంచా తయారీ కర్మాగారానికి లైసెన్స్ ఉన్నదని పోలీస్ అధికారి తెలిపారు. అయితే భద్రతా ప్రమాణాల ఉల్లంఘన, కార్యకలాపాల్లో నిర్లక్ష్యం కారణంగా పేలుడు జరిగినట్లు చెప్పారు. యజమాని ఖలీద్‌తో పాటు అతడి సోదరుడు కూడా ఈ పేలుడులో గాయపడినట్లు వివరించారు. ఈ సంఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.


