నవతెలంగాణ- హైదరాబాద్: ఇజ్రాయెల్‌లో జెరూసలెం శిరవారుల్లోని అడవుల్లో భారీ కార్చిచ్చు సంభవించింది. పొడి వాతావరణం, గాలులతో మంటలు వేగంగా వ్యాపిస్తుడటంతో దాదాపు 3,000 ఎకరాల అడవులు తగలబడ్డాయి. జెరూసలెం నుంచి తెల్ అవీవ్ ప్రధాన రహదారి వరకు మంటలు వ్యాపించటంతో ఆ దారులన్నీ అధికారులు మూసేశారు. అలాగే, వేలాది మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఈ మంటలను ఆర్పేందుకు 160కి పైగా అగ్నిమాపక బృందాలు, డజన్ల సంఖ్యలో విమానాలు, హెలికాప్టర్లు, సైన్యం కూడా రంగంలోకి దిగాయి. మంటలను అదుపుచేసేందుకు అంతర్జాతీయ సహాయం కోరగా, ఉక్రెయిన్, స్పెయిన్, ఫ్రాన్స్, రొమేనియా, క్రోయేషియా, ఇటలీ వంటి దేశాలు తమ విమానాలను పంపనున్నట్టు ప్రకటించాయి.
ఈ ప్రమాదంపై ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ స్పందించారు. ఈ ప్రమాదం కారణంగా జెరూసలెంలో జరగాల్సిన స్వాతంత్య్ర దినోత్స వేడుకలను రద్దు చేస్తున్నట్ల ప్రకటించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని.. మంటలు నగరంలోకి ప్రవేశించే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. కార్చిచ్చుకు సంబంధించిన వీడియోలు, ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి.
జెరూసలెం అడవుల్లో భారీ కార్చిచ్చు
- Advertisement -
- Advertisement -