Friday, January 9, 2026
E-PAPER
Homeట్రెండింగ్ న్యూస్బయటపడ్డ భారీ భూ కుంభకోణం.. రూ. 2 వేల కోట్లు..!

బయటపడ్డ భారీ భూ కుంభకోణం.. రూ. 2 వేల కోట్లు..!

- Advertisement -

నవతెలంగాణ-హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర రాజధాని నగరం అయిన హైదరాబాద్ శివారులో మరో భారీ భూ కుంభకోణం వెలుగు చూడటం సంచలనం సృష్టించింది. రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం మక్తా మహబూబ్‌పేట పరిధిలోని సర్వే నంబర్ 44 లో 43 ఎకరాల భూమి ఉంది. దీని విలువ సుమారు రూ. 2 వేల కోట్లు ఉంటుంది. ఈ భూమిని కాజేసేందుకు ఓ ముఠా పన్నిన కుట్ర తాజాగా బట్టబయలైంది. ఈ భూములను ఆక్రమించుకునేందుకు కేటుగాళ్లు ఏకంగా 58 ఏళ్ల క్రితమే (పాత తేదీలతో) రిజిస్ట్రేషన్ జరిగినట్లు నకిలీ డాక్యుమెంట్లను సృష్టించారు. ప్రభుత్వ ఆస్తులను రక్షించాల్సిన అధికారులే ఈ అక్రమానికి వత్తాసు పలకడం గమనార్హం. నకిలీ పత్రాల సృష్టికి, అక్రమ రిజిస్ట్రేషన్‌కు రంగారెడ్డి జిల్లా రిజిస్ట్రేషన్ కార్యాలయం జాయింట్ సబ్ రిజిస్ట్రార్-2 కె.మధుసూదన్ రెడ్డి సహకరించారు.

ఇది గమనించిన రిజిస్ట్రేషన్ల శాఖ ఐజీ రాజీవ్ గాంధీ హనుమంతు జాయింట్ సబ్ రిజిస్ట్రార్-2ని సస్పెండ్ చేశారు. ఈ భారీ భూ స్కాంపై స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ భూములను అన్యాక్రాంతం చేసేందుకు సహకరించిన అధికారి మధుసూదన్ రెడ్డిపై కేవలం శాఖాపరమైన చర్యలతో సరిపెట్టకుండా, అతనిపై తక్షణమే పీడీ యాక్ట్ నమోదు చేసి జైలుకు పంపాలని అధికారులను ఆదేశించారు. భూ కబ్జాలకు, నకిలీ రిజిస్ట్రేషన్లకు పాల్పడే అధికారుల పట్ల ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందనే హెచ్చరికగా ఈ చర్యను చూస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -