- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్: ఉత్తరాఖండ్ రాష్ట్రంలో రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో అనేక ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడుతున్నాయి. తాజా దేవప్రయాగ్ డిగ్రీ కళాశాల సమీపంలో కొండచరియలు విరిగిపడటంతో.. ఆ ప్రాంతాన్ని సమీక్షించేందుకు గర్వాల్ ఎంపీ అనిల్ బలూనీ, దేవప్రయాగ్ ముల వినోద్ కందారి అక్కడకు వెళ్లారు.
అధికారులతో కలిసి పర్యవేక్షిస్తున్న సమయంలో.. మరోసారి పెద్ద ఎత్తున కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో భయాందోళనకు గురైన అధికారులు, ఎంపీ అక్కడి నుంచి పరుగులు పెట్టారు. అప్రమత్తమైన ఎంపీ అనిల్ బలూనీ, అధికారులకు అక్కడి నుంచి వెనువెంటనే వెళ్లిపోయారు.
- Advertisement -