Saturday, November 1, 2025
E-PAPER
Homeకరీంనగర్భారీ నిర్లక్ష్యం..! కాలం చెల్లిన పానీయం విక్రయం

భారీ నిర్లక్ష్యం..! కాలం చెల్లిన పానీయం విక్రయం

- Advertisement -

నవతెలంగాణ-రాయికల్: జగిత్యాల జిల్లా రాయికల్  పట్టణంలోని గాంధీ చౌక్ సమీపంలో గల బెంగళూరు బేకరీ, కేక్ హౌస్ లో కాలం చెల్లిన (ఎక్స్పైరీ) శీతల పానీయం విక్రయించిన ఘటన కలకలం రేపింది. కథలాపూర్ మండల కేంద్రానికి చెందిన హరికృష్ణ రామాజీపేట గ్రామంలో శుభకార్యానికి వెళ్తూ బేకరీలో బి నేచురల్ మిక్స్డ్ ఫ్రూట్ పానీయం కొనుగోలు చేశాడు. ఇంటికి చేరుకున్న తర్వాత పిల్లలకు తాగించారు. తదుపరి బంధువులు ఆ డబ్బాపై ఈ నెల 21వ తేదీకి ఎక్స్పైరీ అయిందని గమనించారు.కాలం చెల్లిన పానీయం తాగడంతో పిల్లలకు అనుకోని అనర్థం ఏదైనా జరిగితే ఎలా అని, హరికృష్ణ బంధువులతో కలిసి దుకాణానికి వెళ్లి యజమానిని ప్రశ్నించగా “కాలం చెల్లిన పానీయం మార్చి ఇస్తాను” అని సమాధానం ఇచ్చినట్లు బాధితుడు పేర్కొన్నాడు.
ఈ విషయమై నవతెలంగాణ ప్రతినిధి  బేకరీ యజమానిని వివరణ కోరగా తాను రెండు నెలలుగా అనారోగ్యంతో ఉండడంతో బేకరీకి సరిగా రావడం లేదని,పిల్లలు చూడకుండా ఇచ్చారని తెలిపాడు. కాలం చెల్లిన మిక్స్డ్ ఫ్రూట్ పానియం డబ్బాల విక్రయంపై మున్సిపల్ కమిషనర్ టి. మనోహర్ గౌడ్ మాట్లాడుతూ..ఈ ఘటనపై సిబ్బందిని విచారణకు పంపామని,కాలం చెల్లిన పానీయాలు లేదా ఆహార పదార్థాలు విక్రయిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఏది ఏమైనా బేకరీలు, దుకాణాల్లో సంబంధిత అధికారుల పర్యావేక్షణ లోపం వల్లే ఇలాంటి సంఘటనలు ఉత్పన్నమవుతున్నాయని, సంబంధిత అధికారులు ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -