రోడ్డుపై భారీ గుంత… పట్టించుకోని అధికారులు
నవతెలంగాణ-మల్హర్ రావు
మండలంలోని ఇప్పలవద్ద నుంచి పెద్దతూoడ్ల గ్రామానికి వేళ్ళు ప్రధాన రహదారిపై భారీగా గుంత ఏర్పడి ప్రమాదకరంగా మారింది. ప్రయాణికులు పగలు,రాత్రివేళల్లో ఆదమరిసి ప్రయాణిస్తే ఇక అంతే భారీ ప్రమాదం బారిన పడే అవకాశం ఉంది.ఈ గుంత దుబ్బపేట గ్రామ పరిధిలోని కస్తూరిబ్బా ఆశ్రమ పాఠశాల దగ్గర రోడ్డుపై భారీ గుంత పడింది.ఈ గుంతను పూడ్చాలని ఆర్అండ్ బి అధికారులకు సమాచారం ఇచ్చిన పట్టించుకోవడం లేదని, ప్రమాదం జరిగితే కానీ పట్టించుకోరాని దుబ్బపేట, గాదంపల్లి, అడ్వాలపల్లి పెద్దతూండ్ల,కిషన్ రావు పల్లి గ్రామస్తులు వాపోతున్నారు. ఇప్పటికైనా సంబంధించిన ఉన్నతాధికారులు, ప్రభుత్వం పట్టించుకోని గుంతను పూడ్చాలని కోరుతున్నారు.



