Friday, May 16, 2025
Homeఆటలుడ‌బ్ల్యూటీసీ విన్న‌ర్‌కు ఈసారి భారీ ప్రైజ్‌మ‌నీ…

డ‌బ్ల్యూటీసీ విన్న‌ర్‌కు ఈసారి భారీ ప్రైజ్‌మ‌నీ…

- Advertisement -

నవతెలంగాణ -హైదరాబాద్: వ‌ర‌ల్డ్ టెస్ట్ చాంపియ‌న్‌షిప్‌కు చెందిన ప్రైజ్‌మ‌నీని తాజాగా ఐసీసీ ప్ర‌క‌టించింది. గ‌త టోర్నీల‌తో పోలిస్తే ఈసారి ప్రైజ్‌మ‌నీని రెండింత‌లు పెంచేసింది. లండ‌న్‌లోని ప్ర‌ఖ్యాత లార్డ్స్ మైదానంలో జూన్ 11వ తేదీ నుంచి ఆస్ట్రేలియా, ద‌క్షిణాఫ్రికా మ‌ధ్య వ‌ర‌ల్డ్ టెస్ట్ చాంపియ‌న్‌షిప్ ఫైన‌ల్ జ‌ర‌గ‌నున్న విష‌యం తెలిసిందే. అయితే, ఈ ఫైన‌ల్‌ నెగ్గిన జ‌ట్టుకు 3.6 మిలియ‌న్ల డాల‌ర్ల (రూ. 30.79 కోట్లు) ప్రైజ్‌మ‌నీ ద‌క్క‌నుంది. ఇక ఫైన‌ల్లో ఓడిన జ‌ట్టుకు 2.1 మిలియ‌న్ల డాల‌ర్ల (రూ. 17.96 కోట్లు) ప్రైజ్‌మ‌నీ అందుతుంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -