Saturday, May 10, 2025
Homeజాతీయంపౌర రక్షణ వాలంటీర్ల నోటీషికేష‌న్‌కు భారీ స్పంద‌న‌

పౌర రక్షణ వాలంటీర్ల నోటీషికేష‌న్‌కు భారీ స్పంద‌న‌

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్‌: భార‌త్-పాక్ ఉద్రిక్త‌త వేళ‌ పౌర రక్షణ విభాగం, హోం మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ డిఫెన్స్ (DGCD) పౌర రక్షణ వాలంటీర్ల కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ జారీ అయిన కొద్ది క్షణాల్లోనే వేలాది మంది యువకులు పౌర రక్షణ వాలంటీర్‌ గా సేవలు అందించేందుకు పొటెత్తారు. ముఖ్యంగా చండీగఢ్ రాష్ట్రంలో వేలాది మంది యువకులు తమ సర్టిఫికెట్లు పట్టుకొని అప్లికేషన్ కోసం పౌర రక్షణ విభాగం వద్దకు చేరుకున్నారు. దీంతో ఆ ప్రాంతం మొత్తం ఒక్కసారిగా కోలాహలంగా మారింది. ఈ సందర్భంగా ఓ యువకుడు మీడియాతో మాట్లాడుతూ.. “మా దేశానికి మా సేవలను అందించడానికి మేము ఇక్కడ ఉన్నామని” చెప్పుకొచ్చాడు. అలాగే పౌర రక్షణ వాలంటీర్ల కోసం ప్రకటన అనంతరం రోడ్డు పైకి వచ్చిన ప్రజలు గుమిగూడి ‘పాకిస్తాన్ ముర్దాబాద్’ నినాదాలు చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -