నవతెలంగాణ-హైదరాబాద్ : తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. ఆదివారం స్వామి వారిని దర్శించుకునేందుకు భక్తులు వివిధ రాష్ట్రాల నుంచి భారీగా తరలివచ్చారు. ఈ మేరకు టోకెన్లు లేని భక్తుల దర్శనానికి సుమారు 24 గంటల సమయం పడుతోంది. ఇక రూ.300 ప్రత్యేక దర్శనానికి టోకెన్ తీసుకున్న వారికి కేవలం 5 నుంచి 6 గంటల్లో శ్రీవారి దర్శనం అవుతోంది. ఇక సోమవారం వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని అన్ని కంపార్ట్‌మెంట్‌లు భక్తులతో కిక్కిరిపోయి.. క్యూలైన్ శిలాతోరణం వరకు ఉంది. ఆదివారం స్వామి వారిని 83,412 మంది భక్తులు దర్శించుకున్నారు. అదేవిధంగా 33,058 మంది భక్తులు తమ తలనీలాలు సమర్పించి స్వామి వారి మొక్కలు తీర్చుకున్నారు. తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.89 కోట్లు వచ్చిందని టీటీడీ అధికారులు వెల్లడించారు.
తిరుమలలో భారీగా భక్తుల రద్దీ..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES