Friday, March 27, 2026
E-PAPER
Homeకరీంనగర్ఆర్బీఎల్‌ బ్యాంక్‌లో భారీ కుంభకోణం..రూ.137 కోట్ల గోల్‌మాల్!

ఆర్బీఎల్‌ బ్యాంక్‌లో భారీ కుంభకోణం..రూ.137 కోట్ల గోల్‌మాల్!

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : కరీంనగర్‌ జిల్లా కిసాన్‌సాగర్‌ ఆర్బీఎల్‌ బ్రాంచ్‌లో భారీ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. 7 మ్యూల్‌ ఖాతాల ద్వారా రూ.137 కోట్ల ఆర్థిక లావాదేవీలు జరిపినట్లు అధికారులు గుర్తించారు. మ్యూల్‌ ఖాతాల ద్వారా అక్రమ లావాదేవీలకు పాల్పడినట్లు గుర్తించారు. చైనా వ్యక్తులతో కలిసి బండారి సాయిరామ్‌ అనే వ్యక్తి మోసాలకు పాల్పడినట్లు తేలింది.

ప్రతి లావాదేవీపై క్రిప్టో కరెన్సీ ద్వారా సాయిరామ్‌ 2 శాతం కమీషన్‌ తీసుకున్నట్లు బయటపడింది. మొత్తం 8 కేసుల్లో 13 మంది నిందితులను అరెస్టు చేసినట్లు కరీంనగర్‌ సీపీ గౌస్‌ ఆలం తెలిపారు.‘‘ నిందితులకు సుమారు రూ.2 కోట్ల కమీషన్‌ వచ్చింది. ఆపరేషన్‌ క్రాక్‌డౌన్‌ 1.0లో భాగంగా మ్యూల్‌ ఖాతాల నెట్‌వర్క్‌ ఛేదించాం. డిప్లొమా, డిగ్రీ, ఇంజినీరింగ్‌ విద్యార్థులు నిందితులుగా ఉన్నారు’’ అని సీపీ వివరించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -