Tuesday, February 24, 2026
E-PAPER
Homeతాజా వార్తలుమావోయిస్టులకు భారీ షాక్.. లొంగిపోయిన అగ్రనేత దేవ్‌జీ

మావోయిస్టులకు భారీ షాక్.. లొంగిపోయిన అగ్రనేత దేవ్‌జీ

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్‌: మావోయిస్టు కేంద్ర కమిటీ అప్రకటిత కార్యదర్శి తిప్పిరి తిరుపతి ఎలియాస్‌ దేవ్‌జీ మంగళవారం తెలంగాణ డీజీపీ శివధర్‌ రెడ్డి ఎదుట లొంగిపోయారు. ఆయనతో పాటు బడే చొక్కారావు, మల్లా రాజిరెడ్డి, నూనె నర్సింహారెడ్డి కూడా లొంగిపోయారు. ఈ మేరకు డీజీపీ శివధర్‌రెడ్డి విలేకరుల సమావేశంలో ప్రకటించారు. డీజీపీ మాట్లాడుతూ.. తెలంగాణలో మొదలైన మావోయిస్టు ఉద్యమం తెలంగాణలోనే ఆఖరి దశకు వచ్చిందన్నారు. ఈ పరిణామంతో ఆ పార్టీ అత్యున్నత స్థాయి సంస్థాగత నిర్మాణం, తెలంగాణ రాష్ట్ర కమిటీ పూర్తిగా నిర్వీర్యం అయిందన్నారు. అజ్ఞాతంలో ఉన్న మావోయిస్టులు అజ్ఞాతం వీడి జనజీవన స్రవంతిలో చేరిపోవాలన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిలుపు మేరకు ఈ నలుగురు అజ్ఞాతం వీడినట్లు తెలిపారు. వీరిపై ఉన్న మొత్తం 90 లక్షల నగదు రివార్డు డీడీ రూపంలో డీజీపీ అందజేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -