ఎఫ్ ఆర్ ఓ శ్రీధర్ ఆచారి
నవతెలంగాణ – జన్నారం
అడవులను కాపాడుకుంటేనే మానవ మనుగడ సాధ్యమవుతుందని, అడవులలో పులులు ఉంటేనే అడవి రక్షింపబడుతుందని, ఇందన్ పల్లి ఎఫ్ఆర్ఓ శ్రీధర చారి అన్నారు. మంగళవారం మండలంలోని కలమడుగు జడ్పీఎస్ఎస్ ప్రభుత్వ పాఠశాలలో నిర్వహించిన పదవ తరగతి పోషకుల సమావేశంలో పాల్గొని మాట్లాడారు. పదవ తరగతి విద్యార్థులు క్రమం తప్పకుండా రోజు ప్రభుత్వ పాఠశాలకు వచ్చి విద్యను అభ్యసించాలన్నారు. టెన్ బై టెన్ జిపిఎ సాధించాలన్నారు.
విద్యార్థుల తల్లిదండ్రులు రోజు క్రమం తప్పకుండా విద్యార్థులను పాఠశాలకు పంపాలని పోషకులకు సూచించారు. అంతర్జాతీయ పులుల దినోత్సవం సందర్భంగా ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల చేత మొక్కలు నాటించారు. మొక్కలు నాటడమే కాదు వాటికి నీరు పోసి వృక్షాలుగా తయారు చేసినప్పుడే మంచి ఫలితం ఉంటుందన్నారు. సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు కట్ట రాజమౌళి మాట్లాడుతూ విద్యార్థులను ఉదయం నాలుగు గంటలకు లేపి చదివించాలని సాయంత్రం 9:30 వరకు చదివించాలని సూచించారు.
పిల్లలకు పౌష్టికాహారం అందజేసి ఆరోగ్యంగా ఉండేలా శ్రద్ధ చూపించాలని తెలియజేశారు.. 10వ తరగతి విద్యార్థులకు నిర్వహించే ప్రత్యేక తరగతులకు పిల్లలను క్రమం తప్పకుండా హాజరయ్యేలా శ్రద్ధ చూపించాలని తెలియజేశారు… కార్యక్రమంలో ఉపాధ్యాయులు విద్యార్థులు అటవీ అధికారులు పాల్గొన్నారు.