Saturday, August 30, 2025
E-PAPER
spot_img
Homeతాజా వార్తలుమేడారంలో హుండీల లెక్కింపు..

మేడారంలో హుండీల లెక్కింపు..

- Advertisement -

– మొత్తం ఆదాయం రూ. 36,49,368
నవతెలంగాణ – తాడ్వాయి : మేడారం సమ్మక్క- సారలమ్మ హుండీలను దేవదాయ శాఖ అధికారులు భారీ బందోబస్తు నడుమ బుధవారం లెక్కించారు. సమ్మక్క ఆదాయం రూ. 18,36,233, సారలమ్మ ఆదాయం రూ. 16,59,383. పగిడిద్దరాజు ఆదాయం. రూ. 72,289. గోవిందరాజు ఆదాయం రూ. 81,469.  సమ్మక్క- సారలమ్మ మొత్తం వనదేవతల ఆదాయం 36,49,368 లక్షలు ఆదాయం వచ్చినట్లుగా ఎండోమెంట్ ఈవో మేకల వీరస్వామి తెలిపారు. మార్చి నెల 28 నుండి జూన్ 18, 2025 వరకు 3 నెలల్లో (పది రోజులు తక్కువ) వచ్చిన మేడారం వనదేవతల ఆదాయం అని తెలిపారు. కాగా స్థానిక ఎస్సై శ్రీకాంత్ రెడ్డి ఆధ్వర్యంలో భారీ బందోబస్తు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పూజారుల సంఘం అధ్యక్షులు సిద్ధబోయిన జగ్గారావు, సమ్మక్క, సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజు వనదేవతల పూజారులు, ఎండోమెంట్ ఈవో వీరస్వామి, ఇన్స్పెక్టర్ నందనం కవిత, సూపర్డెంట్ గుమ్మడవెల్లి క్రాంతి, ఎండోమెంట్ సిబ్బంది రాజేశ్వరరావు, జగన్, మధు, బాలకృష్ణ, కిషన్, వీరన్న, సోలం సంపత్, కొప్పుల శ్యామ్ ఎండోమెంట్, రెవెన్యూ ల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad