- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: వికారాబాద్ జిల్లా తాండూరులోని సాయాపూర్‌లో కట్నం తేవాలని దూషిస్తూ, కర్రతో విచక్షణారహితంగా కొట్టడంతో అనూష అనే యువతి మృతి చెందింది. 8 నెలల కిందట తల్లిదండ్రుల ఇష్టం లేకపోయినా వివాహం చేసుకున్న అనూషకు అత్తమామలతోపాటు భర్త నుంచి వరకట్న వేధింపులు మొదలయ్యాయి. వారం క్రితం భర్త కొట్టడంతో గాయపడిన అనూషను పుట్టింటికి తీసుకెళ్లగా, సరిగా చూసుకుంటానని చెప్పి తీసుకెళ్లిన భర్త పరమేష్ మరోసారి గొడవపడి తీవ్రంగా కొట్టడంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది.
- Advertisement -



