Monday, April 6, 2026
E-PAPER
Homeక్రైమ్భార్యను చంపి భర్త ఆత్మహత్య..

భార్యను చంపి భర్త ఆత్మహత్య..

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : ప్రకాశం జిల్లా అద్దంకి నియోజకవర్గం పిచ్చుకలగుడిపాడులో దారుణం జరిగింది. అనుమానంతో భార్యను హత్య చేసి అనంతరం భర్త ఆత్మహత్య చేసుకున్న ఘటన కలకలం రేపింది. ఫలతోటి రామారావు (45) భార్య అరుణ (40)పై అనుమానంతో కొంతకాలంగా గొడవ పడుతున్నాడు. ఇదే క్రమంలో ఆదివారం రాత్రి జరిగిన ఘర్షణలో రామారావు భార్యపై దాడి చేయగా, ఆమె మృతి చెందింది. అనంతరం ఆయన విషం తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -