- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్; జార్ఖండ్‌లో బీమా డబ్బుల కోసం ఓ భర్త తన భార్యను హత్య చేసిన ఘటన కలకలం రేపింది. వివాహం జరిగిన నాలుగు నెలలకే బీమా నగదు కోసం భార్యను గొంతునులిమి చంపి, ప్రమాదంగా చూపించేందుకు ప్రయత్నించాడు. మొదట్లో పోలీసులను కూడా తప్పుదారి పట్టించినా, అతని అబద్ధం బయటపడింది. పోలీసుల విచారణలో భర్త నేరాన్ని ఒప్పుకున్నాడు. బీమా డబ్బు కోసమే ఈ హత్య చేసినట్టు తేలడంతో పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడిని రిమాండుకు తరలించారు.
- Advertisement -