నవతెలంగాణ – హైదరాబాద్: నగరంలోని చాంద్రాయణగుట్టలో ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పదస్థితిలో మృతిచెందడం కలకలం రేపింది. ఇవాళ ఉదయం ఓల్డ్ సిటీ పరిధిలోని చాంద్రాయణగుట్టలో ఫ్లైఓవర్ కింద పార్క్ చేసిన ఓ ఆటోలో ఇద్దరు యువకుల డెడ్‌బాడీలను స్థానికులు గుర్తించారు. ఈ మేరకు పోలీసులకు సమాచారం అందజేయగా వారు వెంటనే స్పాట్‌కు చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తును ప్రారంభించారు. మృతులను జహంగీర్ (24), ఇర్ఫాన్ (25)గా గుర్తించారు. అయితే, యువకుల మృతిపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. చనిపోయిన ఇద్దరూ పహడీషరీఫ్ ప్రాంతంలోని పిసల్‌బండకు చెందిన వారిగా గుర్తించారు. ఘటనా స్థలంలో డ్రగ్స్ ఇంజెక్షన్లను పోలీసులు గుర్తించారు. అధిక మోతాదులో డ్రగ్స్ తీసుకోవడం వల్లే వారు ప్రాణాలు కోల్పోయి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. మరింత సమాచారం ఇంకా తెలియాల్సి ఉంది.
హైదరాబాద్ లో కలకలం.. ఆటోలో రెండు మృతదేహాలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



