నవతెలంగాణ-హైదరాబాద్: సాఫ్ట్‌వేర్, లైఫ్‌సైన్సెస్ రంగాల్లో హైదరాబాద్ జీసీసీ హబ్‌గా మారిందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. హైదరాబాద్‌లోని నానక్‌రామ్‌గూడలో సొనాటా సాఫ్ట్‌వేర్ సంస్థను ముఖ్యమంత్రి ప్రారంభించి మాట్లాడారు. ఏఐ-రెడీ డేటా సెంటర్లు, తయారీ రంగాలకు హైదరాబాద్ కేంద్రంగా మారిందన్నారు. కొత్తగా రూ.3 లక్షల కోట్ల పెట్టుబడులు, లక్షకు పైగా ఉద్యోగాలు సఅష్టించినట్లు చెప్పారు. మరిన్ని ప్రపంచ స్థాయి కార్యక్రమాలను నిర్వహించాలని ప్రభుత్వం యోచిస్తోందని అన్నారు. రాష్ట్రంలో అభివఅద్ధి, పెట్టుబడులు, ఉద్యోగాల కల్పన, సంక్షేమం సమతుల్యంగా సాగుతున్నాయని వివరించారు. ట్రిలియన్ డాలర్ ఆర్థిక వ్యవస్థగా ఎదగడంలో అందరి సహకారం కోరుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, మంత్రి శ్రీధర్‌బాబు పాల్గొన్నారు.
ఆ రంగాల్లో హైదరాబాద్ జీసీసీ హబ్‌గా మారింది: సీఎం రేవంత్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES