Friday, August 29, 2025
E-PAPER
spot_img
Homeతాజా వార్తలుహైదరాబాద్ మేయర్ విజయలక్ష్మికి ఫోన్ వేధింపులు

హైదరాబాద్ మేయర్ విజయలక్ష్మికి ఫోన్ వేధింపులు

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైదరాబాద్‌: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్‌ఎంసీ) మేయర్ గద్వాల విజయలక్ష్మికి బెదిరింపు ఫోన్ కాల్స్ రావడం కలకలం రేపింది. గుర్తు తెలియని వ్యక్తి ఫోన్ చేసి వేధించాడు. అర్ధరాత్రి ఫోన్లు చేస్తూ బెదిరింపులకు పాల్పడ్డాడు. మేయర్‌తో పాటు ఆమె తండ్రి కేశవరావు (కేకే)ని అంతం చేస్తానంటూ దుండగుడు వాయిస్ మెసేజ్‌లు పెట్టాడు.
బోరబండలో ఇటీవల ఆత్మహత్య చేసుకున్న సర్ధార్‌కు చెందిన వ్యక్తిగా చెప్పుకున్నాడు. అసభ్యకరమైన పదజాలంతో బెదిరింపులు రావడంతో మేయర్ పీఆర్వో దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
నిందితుడి ఆచూకీ కోసం పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నారు. బెదిరింపులకు పాల్పడిన వ్యక్తి ఎవరనే దానిపై ఫోన్ నెంబర్ ఆధారంగా ఆరా తీస్తున్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad