Thursday, October 30, 2025
E-PAPER
Homeబీజినెస్హైదరాబాద్ – విశాఖపట్నం రైల్వే మార్గం

హైదరాబాద్ – విశాఖపట్నం రైల్వే మార్గం

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : భారత టెలికాం నియంత్రణ ప్రాధికార సంస్థ (టి.ఆర్. ఏ. ఐ) సెప్టెంబర్ 2025 నెలలో ఆంధ్రప్రదేశ్ లైసెన్స్డ్ సర్వీస్ ఏరియా (ఎల్‌.ఎస్‌.ఏ.)లోని హైదరాబాద్ – విశాఖపట్నం రైల్వే  మార్గం మరియు విశాఖపట్నం – విజయవాడ హైవే మార్గం పై విస్తృతంగా నిర్వహించిన స్వతంత్ర డ్రైవ్ టెస్ట్‌ (ఐ.డి.టి.) ఫలితాలను విడుదల చేసింది. టి.ఆర్.ఏ.ఐ ప్రాంతీయ కార్యాలయం, హైదరాబాద్  పర్యవేక్షణలోనిర్వహించిన ఈ డ్రైవ్ టెస్టులు — పట్టణ మండలాలు, ఇన్స్టిట్యూషనల్  హాట్‌స్పాట్లు, గ్రామీణ నివాస ప్రాంతాలు మొదలైన వివిధ వినియోగ పరిసరాల్లో — వాస్తవ ప్రపంచ మొబైల్ నెట్‌వర్క్ పనితీరును అంచనా వేయడానికి రూపొందించబడ్డాయి. 2025 సెప్టెంబర్ 3 నుండి సెప్టెంబర్ 4 వరకు, టి.ఆర్.ఏ.ఐ  బృందాలు 695.7 కిలోమీటర్ల హైదరాబాద్ – విశాఖపట్నం రైల్వే మార్గం మరియు 363.2 కిలోమీటర్ల విశాఖపట్నం – విజయవాడ హైవే మార్గం పై  వివరణాత్మక డ్రైవ్ టెస్టులు నిర్వహించాయి. ఈ పరీక్షల్లో 2G, 3G, 4G మరియు 5G సాంకేతికతలను పరిశీలించి, వినియోగదారుల హ్యాండ్ సెట్  వివిధ సామర్థ్యాలపై సర్వీస్  అనుభవాన్ని ప్రతిబింబించాయి. ఐ.డి.టి . ఫలితాలను సంబంధిత అన్ని టెలికాం సర్వీస్ ప్రొవైడర్లకు (టి.ఎస్‌.పీలు) ఇప్పటికే తెలియజేయబడింది.

ముఖ్యంగా అంచనా వేయబడిన పారామీటర్లు
a) వాయిస్ సేవలు: కాల్ సెటప్ సక్సెస్ రేట్ (CSSR), డ్రాప్ కాల్ రేట్ (DCR), కాల్ సెటప్ టైమ్, కాల్ సైలెన్స్ రేట్, స్పీచ్ క్వాలిటీ (MOS), కవరేజ్.
b) డేటా సేవలు: డౌన్‌లోడ్/అప్‌లోడ్ త్రుపుట్, లేటెన్సీ, జిట్టర్, ప్యాకెట్ డ్రాప్ రేట్ మరియు వీడియో స్ట్రీమింగ్ డిలే.
హైదరాబాద్ – విశాఖపట్నం రైల్వే మార్గం మరియు విశాఖపట్నం – విజయవాడ హైవేలో మొత్తం మొబైల్ నెట్‌వర్క్ పనితీరు క్రిందివిధంగా సారాంశంగా ఉంది: కాల్ సెటప్ సక్సెస్ రేట్: ఆటో-సెలెక్షన్ మోడ్‌ (5G/4G/3G/2G) లో ఎయిర్‌టెల్, బి‌.ఎస్‌.ఎన్‌.ఎల్‌, ఆర్‌.జె‌.ఐ‌.ఎల్‌ మరియు వి‌.ఐ‌.ఎల్‌ సంస్థల కాల్ సెటప్ సక్సెస్ రేట్లు వరుసగా 98.91%, 49.02%, 95.79% మరియు 91.61% గా నమోదయ్యాయి.
డ్రాప్ కాల్ రేట్: ఆటో-సెలెక్షన్ మోడ్‌ (5G/4G/3G/2G) లో ఎయిర్‌టెల్, బి‌.ఎస్‌.ఎన్‌.ఎల్‌, ఆర్‌.జె‌.ఐ‌.ఎల్‌ మరియు వి‌.ఐ‌.ఎల్‌ సంస్థల డ్రాప్ కాల్ రేట్లు వరుసగా 0.00%, 17.60%, 0.37% మరియు 1.10% గా నమోదయ్యాయి.
CSSR: కాల్ సెటప్ సక్సెస్ రేట్ (శాతాల్లో %), CST: కాల్ సెటప్ టైమ్ (సెకన్లలో), DCR: డ్రాప్ కాల్ రేట్ (శాతాల్లో %) MOS: మీన్ ఓపినియన్ స్కోర్ (సగటు అభిప్రాయ రేటింగ్)
సారాంశం – వాయిస్ సేవలు
కాల్ సెటప్ సక్సెస్ రేట్: ఆటో-సెలెక్షన్ మోడ్‌ (5G/4G/3G/2G) లో ఎయిర్‌టెల్, బి‌.ఎస్‌.ఎన్‌.ఎల్‌, ఆర్‌.జె‌.ఐ‌.ఎల్‌ మరియు వి‌.ఐ‌.ఎల్‌ సంస్థల కాల్ సెటప్ సక్సెస్ రేట్లు వరుసగా 98.91%, 49.02%, 95.79% మరియు 91.61% గా నమోదయ్యాయి.
కాల్ సెటప్ టైమ్ : ఆటో-సెలెక్షన్ మోడ్‌ (5G/4G/3G/2G) లో ఎయిర్‌టెల్, బి‌.ఎస్‌.ఎన్‌.ఎల్‌, ఆర్‌.జె‌.ఐ‌.ఎల్‌ మరియు వి‌.ఐ‌.ఎల్‌ సంస్థల కాల్ సెటప్ టైమ్ వరుసగా 1.12, 4.01, 1.05 మరియు 1.03 సెకన్లు గా ఉంది.
డ్రాప్ కాల్ రేట్ : ఆటో-సెలెక్షన్ మోడ్‌ (5G/4G/3G/2G) లో ఎయిర్‌టెల్, బి‌.ఎస్‌.ఎన్‌.ఎల్‌, ఆర్‌.జె‌.ఐ‌.ఎల్‌ మరియు వి‌.ఐ‌.ఎల్‌ సంస్థల డ్రాప్ కాల్ రేట్లు వరుసగా 0.00%, 17.60%, 0.37% మరియు 1.10% గా నమోదయ్యాయి.
కాల్ సైలెన్స్/మ్యూట్ రేట్ : ప్యాకెట్ స్విచ్డ్ నెట్‌వర్క్‌ (4G/5G) లో ఎయిర్‌టెల్, బి‌.ఎస్‌.ఎన్‌.ఎల్‌, ఆర్‌.జె‌.ఐ‌.ఎల్‌ మరియు వి‌.ఐ‌.ఎల్‌ సంస్థల సైలెన్స్ కాల్ రేట్లు వరుసగా 0.00%, 2.88%, 3.00% మరియు 3.06% గా నమోదయ్యాయి.
మీన్ ఓపినియన్ స్కోర్ (MOS): ఎయిర్‌టెల్, బి‌.ఎస్‌.ఎన్‌.ఎల్‌, ఆర్‌.జె‌.ఐ‌.ఎల్‌ వి‌.ఐ‌.ఎల్‌ సంస్థల సగటు MOS విలువలు వరుసగా 3.93, 2.43, 3.82 మరియు 3.85 గా ఉన్నాయి.
సారాంశం – డేటా సేవలు
డేటా డౌన్‌లోడ్ పనితీరు: ఎయిర్‌టెల్‌ (5G/4G/2G) సగటు డౌన్‌లోడ్ వేగం 106.60 Mbps, బి‌.ఎస్‌.ఎన్‌.ఎల్‌ (4G/3G/2G) 5.98 Mbps, ఆర్‌.జె‌.ఐ‌.ఎల్‌ (5G/4G) 172.40 Mbps, మరియు వి‌.ఐ‌.ఎల్‌ (5G/4G/2G) 31.14 Mbps గా ఉంది.డేటా అప్‌లోడ్ పనితీరు : ఎయిర్‌టెల్‌ (5G/4G/2G) సగటు అప్‌లోడ్ వేగం 15.10 Mbps, బి‌.ఎస్‌.ఎన్‌.ఎల్‌ (4G/3G/2G) 4.39 Mbps, ఆర్‌.జె‌.ఐ‌.ఎల్‌ (5G/4G) 13.49 Mbps,  వి‌.ఐ‌.ఎల్‌ (5G/4G/2G) 6.58 Mbps గా నమోదయ్యాయి.
లేటెన్సీ: ఎయిర్‌టెల్‌, బి‌.ఎస్‌.ఎన్‌.ఎల్‌, ఆర్‌.జె‌.ఐ‌.ఎల్‌, వి‌.ఐ‌.ఎల్‌ సంస్థల 50వ శాత లేటెన్సీ విలువలు వరుసగా 24.30 ms, 25.10 ms, 27.75 ms మరియు 35.90 ms గా నమోదయ్యాయి.
హైదరాబాద్ – విశాఖపట్నం రైల్వే మార్గంలో, ఈ అంచనాలో పగిడిపల్లి, వరంగల్, ఖమ్మం, మోటుమారి, విజయవాడ, ఎలూరు, రాజమహేంద్రవరం, తిమ్మాపురం మరియు సమర్లకోట మొదలైన ప్రాంతాల గుండా  వెళ్లే భాగాలను కలుపుకుంది. విశాఖపట్నం – విజయవాడ హైవే మార్గంలో, కాశిమ్కోట, రెగుపాలెం, నక్కపల్లి, ప్రతిపాడు, రాజనగరం, దుబచెరియా, హనుమాన్ జంక్షన్, గన్నవరం మరియు రామవరపాడు  మొదలైన ప్రాంతాలు కవర్ చేయబడ్డాయి. పరీక్షలు  టి. ఆర్. ఏ. ఐ TRAI సూచించిన పరికరాలు మరియు ప్రమాణీకృత ప్రోటోకాల్స్‌ ఉపయోగించి రీయల్ టైమ్ పరిసరాల్లో నిర్వహించబడ్డాయి. వివరణాత్మక  నివేదిక భాదూవిప్రా వెబ్‌సైట్‌ www.trai.gov.in లో అందుబాటులో ఉంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -