Friday, August 29, 2025
E-PAPER
spot_img
Homeతాజా వార్తలుబేగంపేటలో హైడ్రా కూల్చివేతలు

బేగంపేటలో హైడ్రా కూల్చివేతలు

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : బేగంపేట- ప్యాట్నీ పరిధి ఆక్రమణలపై హైడ్రా అధికారులు కొరడా ఝులిపిస్తున్నారు. పాట్నీ నాలా పరివాహక ప్రాంతంలో ఆక్రమణలను అధికారులు తొలగిస్తున్నారు. కంటోన్మెంట్‌ యంత్రాంగంతో కలిసి నాలాపై నిర్మించిన అక్రమ కట్టడాల తొల‌గింపును అధికారులు చేప‌ట్టారు.
నాలాను ఆనుకొని ఉన్న రెండు భవనాలను కూల్చివేస్తున్నారు. గురువారం కంటోన్మెంట్‌ సీఈఓ మధుకర్‌ నాయక్‌తో కలిసి హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌ ప్యాట్నీ నాలాను పరిశీలించారు. ఈ సందర్భంగా నాలాను ఆక్రమించినవారిపై చర్యలు తప్పవని స్పష్టం చేశారు.
దీంతో శుక్రవారం ఉదయాన్నే బుల్డోజర్లతో అక్కడి చేరుకున్న హైడ్రా సిబ్బంది ఆక్రమణలను కూల్చివేశారు. అక్రమ నిర్మాణాలతో ప్యాట్నీ నాలా కుచించుకుపోవడంతో వరదలు వచ్చినప్పుడు కాలనీలు, ఇండ్లలోకి నీరు ప్రవేశిస్తుందని స్థానికులు హైడ్రాకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో తాజాగా అధికారులు కూల్చివేతలు చేపట్టారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad