నవతెలంగాణ-హైదరాబాద్ : సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఏఐ ఫొటోస్‌పై నటి శ్రీలీల ఆవేదన వ్యక్తం చేశారు. చేతులు జోడించి వేడుకుంటున్నాను.. దయచేసి ఏఐ జనరేటెడ్ నాన్సెన్స్‌ను ఎంకరేజ్ చేయకండి అని వేడుకున్నారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా పోస్టు పెట్టారు. శ్రమను తగ్గించడానికి టెక్నాలజీని వాడుకోవాలని కానీ.. ఇలా దుర్వినియోగం చేయొద్దని విజ్ఞప్తి చేశారు. ప్రతీ మహిళ సమాజంలో ఏదో ఒక పని పనిచేసుకుంటూ వెళ్తుంది. ఇలాంటి పరిస్థితులు వారిని బలహీన పరుస్తాయి. దయచేసి ఆపండి. అందరం బాధ్యతగా ఉందాం అని పేర్కొన్నారు. కాగా, తొలి సినిమాతోనే మంచి హిట్ అందుకున్న శ్రీలీల ప్రస్తుతం ఇండస్ట్రీలో బిజీ యాక్టర్‌గా మారిపోయారు. ఈ భామ డేట్స్ కోసం దర్శక నిర్మాతలు క్యూ కట్టే పరిస్థితి నెలకొంది. రవితేజ, మహేశ్ బాబు సరసన ఇప్పటికే నటించగా.. తాజాగా పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ప్రధాన పాత్రలో వస్తోన్న ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోంది. ప్రస్తుతం కెరియర్ మంచి పొజిషన్‌లో ఉన్న సమయంలో సోషల్ మీడియా వేడికగా తనను బ్యాడ్ చేసే ప్రయత్నం చేయొద్దని రిక్వెస్ట్ చేశారు.
చేతులు జోడించి వేడుకుంటున్నా..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



