Friday, August 8, 2025
E-PAPER
spot_img
Homeదర్వాజనేను అలా చేయలేను

నేను అలా చేయలేను

- Advertisement -

వాళ్ల పథకాలకు బాష్యాలు రాసి
పాటలు అల్లి గొంతెత్తి పాడలేను
వాళ్లను కాపాడే రక్షణ కవచంలా
అక్షరాల అడ్డు నిలబడలేను
ప్రలోభాలకు తాకట్టు పడలేను
ఎంత మానసిక ఒత్తిడికీ గురిచేసిన
దుర్మార్గంగా వ్యవహరిస్తున్న కాలం
వాంగ్మూలానికి సాక్షి సంతకం చేయలేను
ఏ ఎండకు ఆ గొడుగు పట్టలేను
అవకాశాన్శి లక్ష్యం చేసుకుని
మరుగుజ్జుగా బతుకలేను
వంకర రాతలు రాయలేను
చేయి అందించి ఒకరిని నడిపించే వేళ
మీరు చెప్పినట్టు ఆడించినట్టు ఆడలేను
కను సన్నల్లో కుప్పి గంతులు వేయలేను
నేను అలా తప్పటడుగులు వేయలేను
శూన్యమైన ఆచరణను కపటించలేను
అంతా మంచిదే అని ప్రకటించలేను
ఎప్పటికీ ప్రశ్నించడం ఆపలేను
నేను అలా ఎన్నటికీ చేయలేను
తప్పుడు కూతలు కూయలేను
తప్పుడు రాతలు రాయలేను
వెన్నెముక లేని అమీబాను కాలేను
– జూకంటి జగన్నాథం

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img