Saturday, January 31, 2026
E-PAPER
Homeజాతీయంఎన్సీపీ (అజిత్)లో ఏం జరుగుతోందో నాకు తెలియదు: శరద్ పవార్

ఎన్సీపీ (అజిత్)లో ఏం జరుగుతోందో నాకు తెలియదు: శరద్ పవార్

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా అజిత్ పవార్ భార్య సునేత్ర పవార్ ఈ రోజు ప్రమాణ స్వీకారం చేయనున్నారనే వార్తలపై శరద్ పవార్ స్పందించారు. ఈ విషయం తనకు తెలియదని, తనతో ఎవరూ చర్చించలేదని వివరించారు. ఈ రోజు ఉదయం న్యూస్ పేపర్ల ద్వారా అజిత్ పవార్ కూటమి సభ్యులు పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారనే విషయం మాత్రమే తనకు తెలిసిందన్నారు. ఆ పార్టీ తరఫున సీనియర్ నేతలు ప్రఫుల్ పటేల్, సునీల్ తట్కారే ప్రభుత్వంతో చర్చలు జరిపినట్లు తెలిసిందన్నారు. బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వంలో చేరాలని సునేత్ర పవార్ నిర్ణయించుకున్నట్లు తమ కుటుంబానికి తెలియదని శరద్ పవార్ పేర్కొన్నారు.

ఎన్సీపీ రెండు కూటములు ఒక్కటవ్వాలన్నదే అజిత్ పవార్ కోరిక అని శరద్ పవార్ తెలిపారు. ఈ విషయంపై నాలుగు నెలలుగా అజిత్ పవార్, శశికాంత్ షిండే, జయంత్ర పాటిల్ చర్చలు జరిపారని, రెండు వర్గాల విలీనానికి ఫిబ్రవరి 12వ తేదీని ఫిక్స్ చేశామని కూడా చెప్పారు. అయితే, ఈలోపు దురదృష్టవశాత్తూ అజిత్ పవార్ విమాన ప్రమాదంలో మరణించారని చెప్పారు. దీంతో విలీన చర్చలకు బ్రేక్ పడిందని వివరించారు. అజిత్ పవార్ చివరి కోరిక నెరవేరాలని తమ కుటుంబం కోరుకుంటోందని శరద్ పవార్ తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -