Tuesday, May 20, 2025
Homeరాష్ట్రీయంఎమ్మెల్యే సంజయ్‌ ఏ పార్టీనో తెలియదు : మాజీ ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి

ఎమ్మెల్యే సంజయ్‌ ఏ పార్టీనో తెలియదు : మాజీ ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి

- Advertisement -

నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌
జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్‌ సంజయ్‌కుమార్‌ ఏ పార్టీనో తనకు తెలియదని మాజీ ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి అన్నారు. ఆ నియోజకవర్గంలో తాను ఆయనతో కలిసి పని చేయడానికి ఆయనెవరు? అని ప్రశ్నించారు. ఆయన ఏ పార్టీనో స్పీకర్‌ను అడిగితే తెలుస్తుందని సూచించారు. సోమవారం హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో ఆయన విలేకర్లతో మాట్లాడారు. తనకు జగిత్యాల అభివృద్ధిపై పూర్తి అవగాహన ఉందన్నారు. కుల, జనగణన చేస్తామంటూ కేంద్ర ప్రభుత్వం ప్రకటించడం ఆహ్వానించదగిన పరిణామమన్నారు. రాష్ట్ర బీజేపీ నేతలు కేంద్రానికి లేఖ రాసేలా ఆ పార్టీ ఎంపీ ఆర్‌. కృష్ణయ్య చొరవ తీసుకోవాలని కోరారు. బీసీ రిజర్వేషన్ల అంశాన్ని కేంద్ర ప్రభుత్వం ఆర్టికల్‌ 9వ షెడ్యూల్‌లో చేర్చాలని ఆయన డిమాండ్‌ చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -