నవతెలంగాణ-హైదరాబాద్: సీజేఐ గవాయ్‌పై షూ విసిరేయబోయే ఘటన పట్ల తానేమీ పశ్చాతాపం పడడం లేదని అడ్వకేట్ రాకేశ్ కిషోర్ అన్నారు. గవాయ్‌పై షూ విసిరేయబోయిన ఘటన గురించి మీడియాతో ఆ లాయర్ మాట్లాడారు. ఆ ఘటన పట్ల తానేమీ నిరాశ చెందడంలేదన్నారు. నేనేమీ భయడడం లేదని, జరిగిన దానికి చింతించడం లేదని అన్నారు. సెప్టెంబర్ 16వ తేదీన కోర్టులో ఓ పిల్ వేశామని, ఆ కేసులో సీజేఐ వ్యాఖ్యల పట్ల బాధపడ్డానని, కానీ తానేమీ తాగి షూ విసిరే ప్రయత్నం చేయలేదన్నారు. ఆ వ్యాఖ్యలకు ఇది నా కౌంటర్ అని అన్నారు.
తానేమీ క్షమాపణలు కోరబోనన్నారు. అలాగే చింతించే అంశం కూడా కాదన్నారు. సున్నిత అంశాలను పరిగణలోకి తీసుకుని జడ్జీలు పనిచేయాలన్నారు. లక్షల సంఖ్యలో కేసులు పెండింగ్‌లో ఉన్నాయని, తానేమీ చేయలేదని, మీరు నన్ను ప్రశ్నిస్తున్నారని, అందుకే దేవుడే నాతో ఈ పని చేయించారని లాయర్ కిషోర్ పేర్కొన్నారు.