నవతెలంగాణ-హైదరాబాద్: ఉత్తరప్రదేశ్‌లో(యూపీ) కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన ప్రత్యేక సమగ్ర ఓటర్ల సవరణ ప్రక్రియ(సర్)పై విశ్వాసం లేదని సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ అన్నారు. ఓటర్ జాబితాలో బడుగు బలహీన వర్గాల ఓట్లను భారీ మొత్తంలో తొలగించి, ఎన్డేయే సర్కార్ కు అనుకూల ఓట్లను అదనంగా జత చేస్తున్నారని ఆరోపించారు. సర్ పేరుతో ఓ జిల్లాలో దాదాపు 3లక్షల ఓట్లు తొలగించారని, ఇంకా మరికొన్ని ఓట్లు తొలగించడానికి ప్రయత్నిస్తున్నారని ఆయన ఆరోపించారు. ఈ చర్య ఎన్నికల సంఘం విశ్వసనీయతపై తీవ్రమైన ప్రశ్నలను లేవనెత్తుతోందని ఆందోళన వ్యక్తం చేశారు.
ఇటీవల యూపీలో నిర్వహించిన సర్ సర్వేతో ముసాయిదా ఓటర్ల జాబితా నుండి మొత్తం 2.89 కోట్ల పేర్లను తొలగించిన విషయం తెలిసిందే. యూపీ వ్యాప్తంగా నిర్వహించిన సర్ ను ఓ రాజకీయ పార్టీ కూడా నిరాకరించలేదని, పైగా అన్ని పార్టీలు బీఎల్‌వోలను నియమించుకున్నాయని మండిపడ్డారు. అధికారిక డేటా అందుబాటులో లేనప్పుడు, ముసాయిదా జాబితా విడుదల కాకముందే, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి నాలుగు కోట్ల మంది ఓటర్లను తొలగిస్తామని ప్రకటించారు, వారు బీజేపీ చెందనివారని లక్నోలో నిర్వహించిన మీడియా సమావేశంలో చెప్పారు.



