Friday, May 16, 2025
Homeఅంతర్జాతీయంయాపిల్ సంస్థ‌ ఇండియాలో విస్త‌రించ‌డం నాకు ఇష్టంలేదు: ట‌్రంప్

యాపిల్ సంస్థ‌ ఇండియాలో విస్త‌రించ‌డం నాకు ఇష్టంలేదు: ట‌్రంప్

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైదరాబాద్‌: అర‌బ్ ప‌ర్య‌ట‌న‌లో ఉన్న‌ అమెరికా అధ్యక్షుడు కీల‌క వ్యాఖ్య‌లు చేశాడు. యాపిల్ సంస్థ శ‌ర‌వేగంగా ఇండియాలో విస్త‌రించ‌డం ప‌ట్ల ట్రంప్ అసంతృప్తి వ్య‌క్తం చేశారు. చైనాకు బయట యాపిల్ తన తయారీని విస్తరించే ప్రణాళిక పట్ల అయిష్టతను కంపెనీ సీఈఓ టిమ్ కుక్‌తోనే చెప్పానని, అమెరికాలో ఉత్పత్తిని పెంచాల‌ని సూచించ‌న‌ని దోహా మీడియా స‌మావేశంలో చెప్పారు. ఈమేర‌కు ఆసిల్ సీఈఓ టిమ్ కుక్‌తో మాట్లాడానని తెలిపారు. ప్రపంచంలోనే అత్యధిక సుంకాలు విధిస్తున్న దేశాల్లో భారత్ ఒకట‌న్నారు. అందుకే అమెరికాలో ఆ సంస్థ ఉత్ప‌త్తులు పెంచాల‌ని చెప్పాన‌ని ఆయ‌న పేర్కొన్నారు. ప్ర‌తీకార సుంకాల విష‌యంలో వ‌ర‌ల్డ్ ట్రేడ్ ఆర్గ‌నైజ‌ష‌న్ భార‌త్ కీల‌క ప్ర‌తిపాద‌న చేసిన విష‌యం తెలిసిందే. భారత్ లో ఉత్పత్తయ్యే ఉక్కు, అల్యూమినియం ఉత్పత్తులపై అమెరికా విధించిన టారిఫ్ లకు ప్రతిస్పందనగా.. అమెరికా నుంచి దిగుమతి అయ్యే వస్తువులపై టారిఫ్ లు విధించాలని ప్రతిపాదిస్తున్నట్లు WTOకు ఇండియా తెలిపింది. ఈక్ర‌మంలో డొనాల్డ్ ట్రంప్ ఈ వ్యాఖ్య‌లు చేయ‌డం గ‌మ‌నార్హం.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -