Tuesday, April 7, 2026
E-PAPER
Homeఆదిలాబాద్ప్రజా సేవ చేసేందుకే రాజకీయాల్లోకి వచ్చా…

ప్రజా సేవ చేసేందుకే రాజకీయాల్లోకి వచ్చా…

- Advertisement -

– ముధోల్ ఎమ్మెల్యే రామారావు పటేల్ 
– ముధోల్ నియోజకవర్గ సమస్యలను అసెంబ్లీలో లేవనెత్తాను..
– రాజకీయం ముఖ్యం కాదు అభివృద్ధి చేయడమే తన లక్ష్యం..
20కోట్లతో రెండు వరుసల రోడ్డు నిర్మాణానికి భూమి పూజ.. 
నవతెలంగాణ-కుభీర్ : ముధోల్ నియోజకవర్గం లో ఉన్న ప్రజలకు సేవ చేసేందుకే రాజకీయాల్లోకి వచ్చానాని ఎమ్మెల్యే పవర్ రామారావు పటేల్ అన్నారు. మంగళవారం మండలంలోని మలేగాం మొండి బసవన్న నుంచి నిగ్వ మహారాష్ట్ర సరిహద్దు వరకు కేంద్ర ప్రభుత్వం సి ఆర్ ఐ ఎఫ్ నిధుల కింద 20 కోట్లు మంజూరు కావడంతో వాటి పనులకు మండల నాయకులతో కలసి భూమి పూజ చేశారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉండి వారికి సేవ చేసేందుకు నేను రాజకీయల్లోకి వచ్చానాని అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో మాట్లాడి నిధులు మంజూరు చేసి పనులను ప్రారంభించాడం జరుగుతుందని అన్నారు. సోమవారం ప్రసిద్ధి పుణ్య క్షేత్రమైన జ్ఞాన సరస్వతి బాసర ఆలయ పునః నిర్మాణానికి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 225కోట్ల నిధులను మంజూరు చేసి పూజలు చేయడం జరిగిందన్నారు. దింతో పాటు ముధోల్ ఇంటిగ్రేటర్ పాఠశాలకు 200కోట్లు మంజూరు చేసి నియోజక వర్గ అభివృద్ది కి కృషి చేస్తానని అన్నారు. దింతో నిధులు మంజూరు చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి నియోజక వర్గ ప్రజల తరుపున కృతజ్ఞతలు తెలిపారు. అదే విదంగా లిఫ్ట్ ఈరిగేషన్ ద్వారా  50వేల ఎకరలో సాగు నీరు అందించడం జరుగుతుందాన్నారు. దింతో పాటు -పంగర్ ఫాడ్, రోడ్డు సోనారి, కుప్టి గ్రామాలకు దశల వారిగా నిధులు మంజూరు చేసి రోడ్లు పూర్తి చేసేలా కృషి చేస్తానని అన్నారు.మండల కేంద్రమైన కుబీర్ లోని వివేకానంద విగ్రహం నుంచి వెటర్నరి అస్పత్రి వరకు రోడ్డు పూర్తిగా గుంతల మాయం కావడం జరిగిందని మండల నాయకులు తెలిపారు. వాటి పనులను కూడా త్వరలో నిధులు మంజూరు చేస్తామనని అన్నారు. ఈ కార్యక్రమం లో మండల బీజేపీ అధ్యక్షులు ఏశాల దత్తాత్రి, సర్పంచుల సంఘం అధ్యక్షులు మారుతీ,వెంకట్ రావు పటేల్, సర్పంచు లు రమేష్ దత్తహరి పటేల్,ఆయా గ్రామాల సర్పంచులు బీజేపీ నాయకులు తదితరులు ఉన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -