నవతెలంగాణ-హైదరాబాద్: పాకిస్థాన్ మహిళ మినాల్ ఖాన్ ను పెళ్లి చేసుకున్న సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (CRPF) కానిస్టేబుల్ మునీర్ అహ్మద్‌ని ఉద్యోగం నుంచి తొలగించిన విషయం తెలిసిందే. తాజాగా తన ఉద్యోగం తొలగింపుపై మునీర్ అహ్మాద్ స్పందించారు. తాను ముందే CRPF ఉన్నతాధికారలుకు పలుమార్లు విషయం తెలియజేశానని, పెండ్లికార్డు కూడా పంపించానని మీడియా సమావేశంలో పేర్కొన్నాడు. తాను పెండ్లికాముందే CRPFలో ఉద్యోగం చేస్తున్నానని, పెండ్లికి అధికారుల అనుమతి తీసుకున్నానని, అంతేకాకుండా ఢిల్లీలోని CRPF ఉన్నతాధికారులకు పెండ్లి కార్డు కూడా పోస్టు చేశానని చెప్పారు. 2022 డిసెంబర్ 31 అధికారులకు లేఖ రాశానని గుర్తు చేశాడు. ఈ తర్వాత మరోసారి సవివరంగా తన పెండ్లి వివరాలు తెలియజేశానని మునీర్ అహ్మద్ వివరించాడు.
CRPF అధికారులకు చెప్పే పెండ్లి చేసుకున్న: మునీర్ అహ్మద్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES