నవతెలంగాణ-హైదరాబాద్: బంగ్లాదేశ్ విద్యార్థి నేత హాదీ హత్యతో ఆ దేశంలో రాజకీయ అలజడి చేలరేగిన విషయం తెలిసిందే. హాదీ హంతకుడు భారత్‌లో ఉన్నట్లు ఆ దేశ పోలీసులు చేసిన ఆరోపణలు నిరాధారమైనవని తెలింది.కేసులో ప్రధాన అనుమానితుడిగా ఉన్న ఫైసల్ కరీం మసూద్ సెల్ఫీ వీడియో విడుదల చేశాడు.
తాను ప్రస్తుతం దుబాయ్ లో ఉన్నానని, హాదీ హత్యతో తనకు ఎలాంటతి సంబంధం లేదని వెల్లడించాడు. హాదీతో తన సంబంధాలు కేవలం వ్యాపార సంబంధమైనవి అని చెప్పాడు. హాదీ జమాత్ కు చెందినవాడని జమాతీలే ఈ హత్య వెనుక ఉండవచ్చని ఆరోపించాడు. తాను ఓ ఐటీ కంపెనీ అధినేత వద్ద పనిచేస్తున్నానని ప్రభుత్వ కాంట్రాక్టులకు సంబంధించి పొలిటికల్ డొనేషన్స్ కోసమే హాదీని కలిసినట్టు చెప్పాడు.
కాగా హాదీని డిసెంబర్ 12న డాకాలోని పల్టాన్ ప్రాంతంలో దుండగులు కాల్చి చంపిన విషయం తెలిసిందే. పొలిటికల్ ప్రచార సభలో ఉన్న అతడిపై కాల్పులు జరపగా తీవ్రంగా గాయపడి సింగపూర్ ఆస్పత్రిలో మరణించాడు. దీంతో బంగ్లాదేశ్ లో అల్లర్లు చెలరేగాయి.



