– సముద్ర అడుగుభాగం అన్వేషణపై పరిశోధకులు
న్యూఢిల్లీ: భూమి నీటి వాటాను అధికంగా కలిగి ఉంటుంది. మూడింటా రెండు వంతులు లోతైన సముద్రాలను కలిగి ఉంటుంది. ఈ లోతైన సముద్రాలు ప్రపంచంలోనే అతిపెద్ద, తక్కువ అన్వేషించిన వ్యవస్థగా పరిశోధకులు చెప్తు న్నారు. సైన్స్ అడ్వాన్సెస్‌లో యూఎస్ పరిశోధకుల కొత్త అధ్యయనం కనిపించని, భౌగోళిక బయాసెస్‌ను లెక్కించటానికి, లోతైన సముద్రపు అడుగు భాగంలో మానవులు ఇప్పటి వరకు ఎంత దృశ్యమానంగా గమనించారో(విజువల్లీ అబ్జర్వ్‌డ్), దానిని మొత్తం పూర్తి చేయటానికి ఎంత సమయం పడుతుందో అంచనా వేసింది.
విజువల్ ఇమేజింగ్ అనేది లోతైన సముద్ర పర్యావరణ వ్యవస్థలను అధ్యయనం చేయటా నికి ఒక ముఖ్యమైన మార్గం. ఇది జీవ, భౌగోళిక నమూనాలను సేకరించిన సందర్భాన్ని ఇస్తుంది. రిమోట్-సెన్సింగ్ డేటాను క్రమాంకం చేయటంలో సహాయ పడుతుంది. పరిశోధకులు 14 దేశాలలోని 34 సంస్థల నుంచి లోతైన సముద్ర దృశ్య డైవ్‌ల 43,681 రికార్డులను సేకరిం చారు. ఈ డైవ్‌లు సంస్థాగత రికార్డులు, పబ్లిక్ డేటా బేస్‌లు, ప్రచురించబడిన పత్రాల నుంచి సేకరించిన డైవ్ కోఆర్డినేట్‌లు, లోతు, తేదీలు, ఆపరేటర్ వివరాలు, ఫ్లాట్ ఫారమ్ రకం గురించి డేటాతో అనుసంధా నించి ఉంటాయి.
డేటాను విశ్లేషించటానికి పరిశోధక బృందం రెండు పద్ధతు లను ఉపయోగించింది. మొదటి దానిలో, వారు వివిధ రకాల సబ్‌మెర్సిబుల్ వాహనాల ద్వారా చిత్రీకరించబడిన ప్రాంతాన్ని అంచనా వేశారు. ప్రతీ డైవ్‌కు కనీస, గరిష్ట సముద్రపు అడుగు భాగ ప్రాంతాన్ని లెక్కించారు. దీంతో వారు మొత్తం దృశ్య కవరేజ్ కనీసం 1259 చదరపు కిలోమీటర్లు, గరిష్టంగా 2130 చదరపు కిలోమీటర్లు ఉంటుం దని అంచనా వేశారు. రెండో దానిలో వారు డైవ్ వ్యవధి, వాహన వేగాన్ని ఉపయోగించారు.
ఇప్పటి వరకు దృశ్య పరిశీలనలు (విజువల్ అబ్జర్వే షన్స్) లోతైన సముద్ర అడుగు భాగంలో 0.001 శాతాన్ని కవర్ చేశాయని పరిశోధకులు తేల్చి చెప్పారు. ఈ విషయంలో సము ద్ర అడుగు భాగంలో అధికంగా ఉండే అగాధ మైదానాలు తక్కువ గా ప్రాతినిధ్యం వహిస్తున్నాయని వివరించారు. ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం పని చేస్తున్న వెయ్యి ప్లాట్‌ఫారమ్‌లకు పరిశీలన సామర్థ్యం పెరిగితే.. ప్రస్తుత రేటుతో సముద్రపు అడుగు భాగాన్ని ఏడాదికి మూడు చదరపు కిలోమీటర్ల చొప్పున సముద్రపు అడుగు భాగాన్ని ఒకసారి కవర్ చేయటానికి ఒక లక్ష ఏండ్లు పడుతుందని పరిశోధక బృందం వివరించింది.
తెలిసింది గోరంతే..
- Advertisement -
- Advertisement -