నవతెలంగాణ-హైదరాబాద్ : తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తన సోదరుడు, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై విమర్శలు చేశారు. సికింద్రాబాద్‌ను జిల్లాగా చేయాలని కేటీఆర్ డిమాండ్ చేసిన విషయం తెలిసిందే. మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘సేవ్ సికింద్రాబాద్’ ర్యాలీకి కేటీఆర్ మద్దతు తెలిపారు.
సికింద్రాబాద్‌ను జిల్లాగా చేయాలన్న కేటీఆర్ డిమాండ్‌పై కవిత స్పందిస్తూ, “కేటీఆర్ సికింద్రాబాద్‌ను జిల్లాగా చేయాలని ఉద్యమిస్తుంటే నాకు నవ్వు వస్తోంది. సికింద్రాబాద్‌ను జిల్లాగా చేయాలని డిమాండ్ చేసిన వారిని పదేళ్లు అధికారంలో ఉన్నప్పుడు అణిచివేశారు, జైళ్లలో వేశారు. కానీ, ఇప్పుడు కేటీఆర్ వెళ్లి సికింద్రాబాద్‌ను జిల్లాగా చేయమని మాట్లాడుతున్నారు” అని విమర్శించారు.



