Friday, October 3, 2025
E-PAPER
Homeతాజా వార్తలుమంచి మిత్రుడిని కోల్పోయాను: బండారు దత్తాత్రేయ

మంచి మిత్రుడిని కోల్పోయాను: బండారు దత్తాత్రేయ

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: సీపీఐ మాజీ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి మృతి పట్ల హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సిద్ధాంతాలు వేరైనా సురవరం తనకు అత్యంత ఆత్మీయ మిత్రుడని, ఆయనను కోల్పోవడం వ్యక్తిగతంగా తీరని లోటని ఆవేదన చెందారు. సురవరం భౌతికకాయానికి దత్తాత్రేయ పుష్పాంజలి ఘటించి, నివాళులర్పించారు. అనంతరం ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించి, వారికి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -