Tuesday, September 30, 2025
E-PAPER
Homeతాజా వార్తలుచేయని తప్పుకు నన్ను బలి చేశారు: నటి హేమ

చేయని తప్పుకు నన్ను బలి చేశారు: నటి హేమ

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: బెంగళూరు రేవ్‌ పార్టీ కేసులో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొన్న నటి హేమ, విజయవాడ ఇంద్రకీలాద్రిపై భావోద్వేగానికి గురయ్యారు. కనకదుర్గమ్మను దర్శించుకున్న అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ కన్నీటిపర్యంతమయ్యారు. తాను చేయని తప్పునకు మీడియా తనను బలిపశువును చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. దుర్గమ్మ సాక్షిగా తాను నిర్దోషినని స్పష్టం చేశారు.

ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈసారి కూడా అమ్మవారి దర్శనానికి వచ్చానని, అయితే ఈ ఏడాది పర్యటనకు ఒక ప్రత్యేకత ఉందని హేమ తెలిపారు. “గత ఏడాది నాపై మీరంతా వేసిన నీలాపనిందలను ఈ దుర్గమ్మే తుడిచిపెట్టింది. చేయని తప్పుకు మీరందరూ నన్ను బలిచేశారు. ఆ సమయంలో ప్రతిక్షణం అమ్మవారే నాకు అండగా నిలిచి, కొండంత ధైర్యాన్నిచ్చారు. ‘నేనున్నాను, నువ్వు ముందుకెళ్లు’ అని నన్ను బతికించారు” అంటూ ఆమె ఉద్వేగానికి లోనయ్యారు. ఎన్ని జన్మలెత్తినా దుర్గమ్మ ఆశీస్సులను మర్చిపోలేనని అన్నారు.

ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులకు హేమ ఒక విజ్ఞప్తి చేశారు. “దయచేసి ఏదైనా వార్త ప్రచురించే ముందు నిజానిజాలు పూర్తిగా తెలుసుకోండి. ఈరోజు నేను గుడిలో ఉండి చెబుతున్నాను.. నేను ఆ తప్పు చేయలేదు” అని ఆమె మరోసారి స్పష్టం చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -