Wednesday, February 4, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఇండిపెండెంట్ గా పోటీ చేసి సత్తా నిరూపిస్తా ...

ఇండిపెండెంట్ గా పోటీ చేసి సత్తా నిరూపిస్తా …

- Advertisement -

నవతెలంగాణ – ఆర్మూర్    
కాంగ్రెస్ పార్టీ సీటు ఇవ్వకుండా తనకు అన్యాయం చేసిన ఇండిపెండెంట్ అభ్యర్థిగా రెండో వార్డ్ లో గెలిచి తన సత్తా ఏంటో నిరూపించుకుంటానని మాజీ కౌన్సిలర్ వనం శేఖర్ అన్నారు. పట్టణంలోని ప్రెస్ క్లబ్ భవనంలో బుధవారం ఆయన మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ  కాంగ్రెస్ పార్టీని నమ్మి ప్రజలు మోసపోవద్దని, కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించవద్దని కోరారు.ఇండిపెండెంట్ అభ్యర్థిగా రెండో వార్డ్ నుండి తాను బరిలో ఉన్నానని,ఫుట్ బాల్ గుర్తుకు ఓటు వేసి తనను గెలిపించాలని కోరారు. యువకులు సైతం కాంగ్రెస్ పార్టీని నమ్మవద్దని, తనకు జరిగిన అన్యాయమే పార్టీలో అందరికీ జరుగుతుందని పేర్కొన్నారు.ఈ  సమావేశంలో యూత్ నాయకులు,కాలనీ వాసులు, తదితరులు ఉన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -