Saturday, October 4, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్క్రీడల నిర్వహణకు తనవంతు సహకారం అందిస్తా..

క్రీడల నిర్వహణకు తనవంతు సహకారం అందిస్తా..

- Advertisement -

– మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్‌
నవతెలంగాణ  – కాటారం

గ్రామీణ ప్రాంతాల్లోని ఎంతో మంది క్రీడాకారులుంటారని అలాంటి వారిలోని క్రీడానైపుణ్యం, ప్రతిభను గుర్తించాల్సిన అవసరం ఉందని మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్‌ అన్నారు. కాటారం మండలం ధన్వాడ గ్రామంలో నిర్వహించిన ధన్వాడ ప్రీమియర్ లీగ్- 10 లో పాల్గొన్న గారెపల్లి క్రికెట్‌ అసోసియేషన్‌ టీమ్ కు భీఆర్ఎస్ పార్టీ మండల యూత్ అధ్యక్షుడు రామిళ్ల కిరణ్, మల్హర్ రావు మండల్ మహీ-333 డిసైడర్స్ టీమ్ కి త్రిశూల్ విజినరీ స్టూడియోస్ (Hey bhagavan movie mekars) స్పాన్సర్స్‌ చేసిన టీ షర్ట్‌లను ఆయన అందజేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ… గ్రామీణ క్రీడలను ప్రోత్సహించడం ద్వారా ఎంతో మంది క్రీడాకారులు వెలుగులోకి వస్తారని అన్నారు. ప్రతిభను గుర్తించాలంటే ఇలాంటి గ్రామీణ క్రీడలు నిర్వహించాల్సిన అవసరం ఉందని, ఇలాంటి క్రీడల నిర్వహణకు తనవంతు సహకారం అందిస్తానని ఆయన స్పష్టం చేశారు. ప్రతి క్రీడాకారుడు గొప్పగా ఆడి జిల్లా రాష్ట్ర జాతీయ స్థాయికి ఎదుగాలని ఆయన ఆకాంక్షించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -