Monday, December 8, 2025
E-PAPER
Homeజిల్లాలుఅవకాశం ఇస్తే బొల్లంపల్లి అభివృద్ధి చేస్తా: సత్తూరి ప్రసాద్ గౌడ్

అవకాశం ఇస్తే బొల్లంపల్లి అభివృద్ధి చేస్తా: సత్తూరి ప్రసాద్ గౌడ్

- Advertisement -






నవతెలంగాణ వెల్దండ
అవకాశం ఇస్తే గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసి చూపిస్తానని బొల్లంపల్లి గ్రామ కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి సత్తూరీ ప్రసాద్ గౌడ్ అన్నారు. ఆదివారం వెల్దండ మండల పరిధిలోని బొల్లంపల్లి గ్రామంలో గ్రామస్తులతో కలిసి ఆయన ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రసాద్ గౌడ్ మాట్లాడుతూ.. గ్రామాన్ని అన్ని రంగాలలో ముందించేందుకు తన వంతుగా కృషి చేస్తానని ఆయన పేర్కొన్నారు. గ్రామంలో చిన్న పెద్ద తేడా లేకుండా అందరికీ న్యాయం చేసే విధంగా పాలన చేస్తానని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -