Wednesday, October 1, 2025
E-PAPER
Homeతాజా వార్తలుఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయ‌ను: ఎమ్మెల్యే రాజాసింగ్

ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయ‌ను: ఎమ్మెల్యే రాజాసింగ్

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్‌: గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎట్టి పరిస్థితుల్లో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయబోను అని అన్నారు. రాజీనామా చేయకపోతే ఏం చేస్తారని అడిగారు. ఎంపీకి, కేంద్రమంత్రి పదవికి కిషన్ రెడ్డి రాజీనామా చేస్తే.. తానూ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని చెప్పారు. ఒకచోట ఇద్దరం స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేద్దాం.. ఎవరు గెలుస్తారో చూద్దామని సంచలన సవాల్ విసిరారు.

ప్రస్తుత బీజేపీ అధ్యక్షుడు రాంచందర్ రావు రబ్బర్ స్టాంపుగా మారరని విమర్శించారు. బీజేపీ కొత్త కమిటీలో అంతా హైదరాబాద్‌కు చెందిన నేతలే ఉన్నారని అన్నారు. ఈ కమిటీని రాంచందర్ రావు వేశారా.. కిషన్ రెడ్డి వేశారో తెలియడం లేదని కీలక వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు కమిటీతో రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే తాను రాజకీయ సన్యాయం తీసుకుంటానని అన్నారు. బీజేపీలో ఎప్పుడు తప్పులు జరిగినా మాట్లాడుతా.. వెనకడుగు వేయబోను అని చెప్పారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -