పోతారంలో అంబలి కేంద్రం ప్రారంభం
నవతెలంగాణ – దుబ్బాక
గ్రామ అభివృద్ధి కోసం తన వంతుగా కృషి చేస్తూ.. పేదల కష్టసుఖాల్లో అండగా ఉంటానని కాంగ్రెస్ జిల్లా సీనియర్ నాయకులు సల్కం మల్లేష్ యాదవ్ అన్నారు.బుధవారం దుబ్బాక మండలం పోతారంలో అంబలి కేంద్రాన్ని ప్రారంభించి.. ప్రజలకు అంబలిని పంపిణీ చేశారు.పోతారం గ్రామంలో గత ఆరేళ్లుగా ప్రతి వేసవిలో అంబలిని ఉచితంగా పంపిణీ చేయడం జరుగుతుందన్నారు.ఈ సందర్భంగా మల్లేష్ యాదవ్ ను గ్రామస్తులు అభినందించారు.ఈ కార్యక్రమంలో బీఎస్పీ దుబ్బాక అసెంబ్లీ అధ్యక్షులు సుద్దాల రాజు,కాంగ్రెస్ గ్రామాధ్యక్షులు కొత్త రాజు,గ్రామస్తులు కొత్త దేవిరెడ్డి,కేశవరెడ్డి,బాల్ రెడ్డి, మషూర్,సల్కం చిన్నదేవయ్య,బాలెళ్ళు,మాందాపురం చంద్రం,జాల చంద్రయ్య,రాజయ్య,సంధిరి కిషన్,పలువురు పాల్గొన్నారు.
కష్టసుఖాల్లో అండగా ఉంటా: మల్లేష్ యాదవ్
- Advertisement -
RELATED ARTICLES