Thursday, May 29, 2025
Homeఅంతర్జాతీయంహార్వర్డ్ యూనివర్సిటీపై విజయం సాధిస్తా: ట్రంప్

హార్వర్డ్ యూనివర్సిటీపై విజయం సాధిస్తా: ట్రంప్

- Advertisement -

నవతెలంగాణ-హైద‌రాబాద్‌: విదేశీ విద్యార్థుల ప‌ట్ల ట్రంప్ వ్య‌వహ‌రించిన తీరును హార్వ‌ర్డ్ త‌ప్పుప‌ట్టిన విష‌యం తెలిసిందే. దీంతో ఆ యూనివర్సిటీకి అందించే సాయాన్ని నిలిపివేయడంతో పాటు పాఠ్యాంశాలు మార్చాలంటూ ఆదేశాలు ఇచ్చారు. ఇటీవల విదేశీ విద్యార్థులను చేర్చుకునే సర్టిఫికేషన్ కూడా ట్రంప్ సర్కార్ రద్దు చేసింది.తాజాగా మరోసారి ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. హార్వర్డ్ యూనివర్సిటీపై విజయం సాధిస్తానని ప్రతిజ్ఞ చేశారు. విశ్వవిద్యాలయానికి అందాల్సిన 3 బిలియన్‌ డాలర్లను దక్కకుండా చేసే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు ట్రంప్ ట్రూత్‌ సోషల్‌లో పోస్టు పెట్టారు. ‘‘ఆ మొత్తాన్ని దేశంలోని ట్రేడ్‌ స్కూల్స్‌కు బదిలీ చేయాలని భావిస్తున్నా. అమెరికాకు ఇది గొప్ప పెట్టుబడి అవుతుంది. విదేశీ విద్యార్థులకు సంబంధించిన జాబితాను యూనివర్సిటీ ఇంకా అందించలేదు. దాని కోసం ఎదురుచూస్తున్నా. దేశానికి ముప్పు రాకుండా ఉండటం కోసం బిలియన్‌ డాలర్లు ఖర్చు చేశాం. ఆ తర్వాత కూడా ఉన్మాదులు, అమెరికాను ఇబ్బందులు పెట్టాలనుకునే వారు ఇంకా ఉన్నారా? అని తెలుసుకోవడం కోసం ఈ జాబితా ఉపయోగపడుతుంది. అప్పుడే అలాంటివారిని దేశంలోకి మళ్లీ రాకుండా నియంత్రించగలం. హార్వర్డ్‌పై మా ప్రభుత్వం విజయం సాధిస్తుంది’’ అని ట్రంప్‌ పేర్కొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -