Thursday, November 27, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్నిబద్దతతో బాధ్యతగా పనిచేస్తా…!

నిబద్దతతో బాధ్యతగా పనిచేస్తా…!

- Advertisement -

నవతెలంగాణ-పెద్దవూర : అందుబాటులో ఉండి గ్రామం లో సమస్యలన్నీ నిబద్దత తో,బాధ్యత గా పరిష్కరిస్తాను.గ్రామం లో అందరికి అందుబాటులో వుంటూ గ్రామ సమస్యలు అన్నీ పరిష్కరిస్తామని మండలం లోని పోతునూరు గ్రామానికి చెందిన  తెలపాటి నాగరాజు అన్నారు.జరగబోయే సర్పంచ్ ఎన్నికలలో  పోటీ చేయాలని అనుకుంటున్నానని  మీరు మీ ఓటు ద్వారా నన్ను ఆశీర్వదిస్థారని మనస్పూర్తిగా కోరుకుంటున్నానని సోషల్ మీడియా లో గురువారం పోస్టు చేశారు.మన గ్రామం అభివృద్ధి కోసం నిధులు తీసుకోస్థానని, అవి సక్రమంగా ఖర్చు అయ్యే విధంగా నిబద్ధతతో బాద్యతగా  పని చేస్తానని తెలిపారు.గ్రామ సభలు నిర్వహించి సమస్యలు ప్రజల ద్వారా తెలుసుకొని పరిష్కరిస్థానని చెప్పారు.అణునిత్యం అందుబాటులో ఉండి ఒక సేవకుడిగా పని చేస్తానని కోరారు.డబ్బులు పెట్టి గెలిచిన వాళ్లు ఆడబ్బులు ఏవిధంగా సంపాదించుకోవాలో ఆలోచిస్తారని, గ్రామ అభివృద్ధి పట్టించుకోరని కావున మీ నన్ను గెలిపిస్తారని నాకు నమ్మకం ఉందని అన్నారు. ఓటు వేసే ముందు ఒకసారి ఆలోచించి ఓటు వేయండని కోరారు. నేను ఎంఏ చదివాను,గ్రామాన్నీ అవృద్ధి పథం లో నడిపిస్తానని తెలిపారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -