Thursday, May 8, 2025
Homeజాతీయంఐఏఎస్‌ అధికారిణి శ్రీలక్ష్మికి సుప్రీంలో చుక్కెదురు

ఐఏఎస్‌ అధికారిణి శ్రీలక్ష్మికి సుప్రీంలో చుక్కెదురు

- Advertisement -

నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
ఐఏఎస్‌ అధికారిణి శ్రీలక్ష్మికి సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. ఓబుళాపురం అక్రమ మైనింగ్‌ కేసులో ఆమెకు విముక్తి కల్పిస్తూ 2022లో తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీం ధర్మాసనం కొట్టివేసింది. ప్రతివాదుల వాదనలను పరిగణనలోకి తీసుకోకుండా హైకోర్టు తీర్పు ఇచ్చిందని సీబీఐ వాదనలు వినిపించింది. ఈ వాదనలతో సుప్రీంకోర్టు ఏకీభవించింది. మళ్లీ శ్రీలక్ష్మి కేసును తాజాగా విచారించాలని తెలంగాణ హైకోర్టుకు ఆదేశాలు జారీ చేసింది.
మూడు నెలల్లోగా విచారణను ముగించాలని హైకోర్టును సుప్రీం ఆదేశించింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లా ఓబులాపురం మైనింగ్స్‌లో అక్రమాలు జరిగాయంటూ సీబీఐ కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో నిందితురాలిగా ఐఏఎస్‌ అధికారిణిని శ్రీలక్ష్మి అరెస్టై కొంతకాలం జైలు శిక్ష కూడా అనుభవించారు. అయితే ఈకేసులో శ్రీలక్ష్మిపై నమోదైన కేసును తెలంగాణ హైకోర్టు కొట్టివేసింది. 2022లో శ్రీలక్ష్మిని ఈ కేసు నుంచి హైకోర్టు డిశ్చార్జ్‌ చేసింది. దీంతో ఈ తీర్పును సవాల్‌ చేస్తూ పిటిషనర్‌ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ కేసుపై బుధవారం సుప్రీంకోర్టులో విచారణ జరగగా.. తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పును కొట్టివేసింది. మళ్లీ శ్రీలక్ష్మి కేసును విచారించాలని ఆదేశాలు జారీ చేసింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -