Tuesday, February 17, 2026
E-PAPER
Homeతాజా వార్తలుహైకోర్టుకు ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ పంచాయితీ

హైకోర్టుకు ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ పంచాయితీ

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్: ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ పంచాయితీ హైకోర్టుకు చేరింది. ఆటో యాదగిరి కిడ్నాప్‌పై హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖ‌లైంది. ఎల్లుండి యాదగిరిని హాజరుపర్చాలని అధికారుల‌ను హైకోర్టు ఆదేశించింది. హైకోర్టు ఆదేశాల‌తో ఇబ్రహీంపట్నం చైర్మన్ ఎన్నిక వాయిదా ప‌డింది.

నిన్న ఇబ్రహీంపట్నం మున్సిపల్ ఛైర్మ‌న్ ఎన్నిక సంద‌ర్భంగా తీవ్ర ఉద్రిక్త‌త నెల‌కొన్న విష‌యం తెలిసిందే. కౌన్సిల్ స‌మావేశానికి ఆటో యాదగిరి బ‌దులు ఆయ‌న భార్య హాజ‌రయ్యారు. దీంతో ప్ర‌తిప‌క్షాలు తీవ్ర అభ్యంత‌రం వ్య‌క్తం చేశాయి. ఆటో యాద‌గిరి వచ్చేంత వ‌ర‌కు ఛైర్మ‌న్, ఉప చైర్మ‌న్ ఎన్నిక వాయిదా వేయాల‌ని ప‌లు పార్టీలు డిమాండ్ చేశాయి. ఈక్ర‌మంలోనే మున్సిప‌ల్ కార్యాల‌యంపై ప‌లు పార్టీల కార్య‌క‌ర్త‌లు రాళ్ల దాడి చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు అద‌న‌పు బ‌ల‌గాలను ర‌ప్పించి ప‌రిస్థితిని అదుపులోకి తెచ్చారు. అయితే చైర్మ‌న్ ఎన్నిక త‌ర్వాత కౌల్సిల్ స‌మావేశానికి ఆటో యాద‌గిరి హాజ‌ర‌య్యారు.

కౌన్సిల్లో పార్టీలు బలాబలాలు..
మున్సిపల్ స‌మావేశానికి ఆకుల యాదగిరి మినహా ఎక్స్ అఫీషియ సభ్యులుతో కలుపుకొని 24 మంది హాజరయ్యారు. వీరిలో బీఆర్ఎస్ కౌన్సిలర్లు కొన్ని ప్రవీణ్ కుమార్, జేర్కోని మమతా రాజు కేకుల సుదర్శన్ రెడ్డి, కొండ్రు శ్రీలత రాంబాబు, కొండిగారి త్రిలోక్, క్యామ శంకర్, అల్వాల జ్యోతి వెంకట రెడ్డి, మడుపు లక్ష్మమ్మ, మంద జయ, చిలకల బుగ్గరాములు, నీలం శ్వేత, గూడూరీ గిరీష్ హాజరుకాగా స్వతంత్ర అభ్యర్థి దాసరి మురళీకృష్ణ వీరి వెంట ఉన్నాను. ఇక బిజెపి మొదటి వార్డ్ అభ్యర్థి ముత్యాల శ్యామల భాస్కర్ బీఆర్ఎస్ మద్దతు ఇస్తున్నారు. ఇక కాంగ్రెస్ కౌన్సిలర్లను పరిశీలిస్తే..నీళ్ల భాను బాబు గౌడ్, మహమ్మద్ అమీనా బేగం,వి రాందాస్, దారు రాఘవేంద్రరావు, దొంతరమోని అని భార్గవి రాజు, ఇందూరి శ్రీనివాస్, ఏదులా విజయలక్ష్మి వెంకట్ రెడ్డి, కప్పర స్రవంతి చందు హాజరు కాగా బిజెపి కౌన్సిలర్ సిద్ధం భానుప్రియ కాంగ్రెస్ కు మద్దతు ఇస్తున్నారు. రంగారెడ్డి కాంగ్రెస్ వెన్నంటి ఉన్నారు.

రెండుగా చీలిన‌ బీజేపీ..
ఇబ్రహీంపట్నంలో కేవలం రెండు వార్డుల్లో విజయం సాధించిన బీజేపీ రెండుగా చీలిపోయింది. ఒకరు ముత్యాల శ్యామల భాస్కర్ టిఆర్ఎస్‌కు మద్దతు ఇస్తుండగా.. 18వ వార్డు కౌన్సిలర్‌గా గెలిచిన సిద్ధం భానుప్రియ మాత్రం కాంగ్రెస్‌కు మద్దతు ఇస్తున్నారు. దీంతో బీజేపీలో వ‌ర్గ‌పోరు బ‌య‌ట‌ప‌డింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -