Saturday, August 9, 2025
E-PAPER
spot_img
Homeరాష్ట్రీయంఐసెట్‌ దరఖాస్తు గడువు 10 వరకు పొడిగింపు

ఐసెట్‌ దరఖాస్తు గడువు 10 వరకు పొడిగింపు

- Advertisement -

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
రాష్ట్రంలో ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో 2025-26 విద్యాసం వత్సరంలో ప్రవేశాల కోసం నిర్వహించే ఐసెట్‌ దరఖాస్తు గడువును ఈనెల పదో తేదీ వరకు ప్రభుత్వం పొడిగించింది. ఈ మేరకు ఐసెట్‌ కన్వీనర్‌ అలువాల రవి శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఆలస్య రుసుం లేకుండా దరఖాస్తుల సమర్పణ గడువును ఈనెల పదో తేదీ వరకు పొడిగిం చామని తెలిపారు. ఇప్పటి వరకు 51,857 మంది అభ్యర్థులు దరఖాస్తు చేశారని వివరించారు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు త్వరగా దరఖాస్తు చేయా లని సూచించారు. జూన్‌ ఎనిమిది, తొమ్మిది తేదీల్లో ఐసెట్‌ రాతపరీక్షలను ఆన్‌లైన్‌లో నిర్వహిస్తారు. ఇతర వివరాల కోసం మార్చి ఆరు నుంచి ష్ట్ర్‌్‌జూర://ఱషవ్‌.్‌రషష్ట్రవ.aష.ఱఅ వెబ్‌సైట్‌ను సంప్రదించాల్సి ఉంటుంది.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img