అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్
నవతెలంగాణ-వనపర్తి
అటవీ శాఖ గెజిట్, సెక్షన్ – 4 ప్రకారం వనపర్తి జిల్లాలో అటవీ భూమిలో ప్రభుత్వం ద్వారా ఏమైనా అసైన్మెంట్ చేసి ఉంటే అట్టి భూమిని గుర్తించాల్సిందిగా జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. సోమవారం కలెక్టర్ తన ఛాంబర్ లో స్పెషల్ ఇన్వెస్టిగేషన్ కమిటీ తో సమావేశం నిర్వహించారు. అటవీ శాఖ గెజిట్ ప్రకారం, సెక్షన్ – 4 ప్రకారం గుర్తించిన అటవీ శాఖ భూమిలో ఇతరత్రా ఎలాంటి నిర్మాణాలు లేదా ఇతరులకు అప్పగించడానికి వీలు లేదని తెలిపారు. జిల్లాలోని అటవీ భూమిలో ఎక్కడైనా పొరపాటున అసైన్మెంట్ చేసి ఉంటే అట్టి భూమిని సర్వే నెంబరుతో సహా గుర్తించడానికి స్పెషల్ ఇన్వెస్టిగేషన్ కమిటీ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఈ కమిటీలో ఫారెస్ట్ అధికారితో పాటు ఆర్డీఓ, ఎ.డి సర్వే ల్యాండ్ రికార్డ్స్, సంబంధిత తహసిల్దార్ తో కమిటి ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. అటవీ భూమిలో అసైన్మెంట్ చేసి ఉంటే గుర్తించి అట్టి పూర్తి వివరాలను ప్రభుత్వానికి పంపించాల్సి ఉంటుందన్నారు. ఈ సమావేశంలో పాల్గొన్న జిల్లా అటవీ శాఖ అధికారి ప్రసాద్ రెడ్డి జిల్లాలో సెక్షన్ – 4 ప్రకారం ఉండాల్సిన అటవీ భూమిలో కొన్నచోట్ల తక్కువగా ఉందని, మరికొన్ని చోట్ల ఉండాల్సిన భూమి కంటే ఎక్కువ భూమి చూపిస్తున్నారని వీటిని సరి చేసి సర్వే ప్రకారం అటవీ శాఖకు ఉండాల్సిన భూమిని గుర్తించి ఇవ్వాల్సిందిగా కోరారు. ఈ సమీక్షలో ఆర్డీఓ సుబ్రమణ్యం , ఎ .డి సర్వే ల్యాండ్ రికార్డ్స్ బాలకృష్ణ, ఆర్ అండ్ బి నుండి డి. ఈ, సెక్షన్ సూపరిండెంట్ తదితరులు పాల్గొన్నారు.
అటవీలోని అసైన్మెంట్ భూమిని గుర్తించండి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES