Tuesday, April 7, 2026
E-PAPER
Homeజిల్లాలుహౌస్ లిస్టింగ్ బ్లాక్‌లను గుర్తించడం అత్యంత కీలకం

హౌస్ లిస్టింగ్ బ్లాక్‌లను గుర్తించడం అత్యంత కీలకం

- Advertisement -
  • జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశం
    నవతెలంగాణ-వనపర్తి: జన గణన 2027 ప్రక్రియలో భాగంగా హౌస్ లిస్టింగ్ బ్లాక్(హెచ్‌ఎల్‌బీ) లను గుర్తించడం అత్యంత కీలకమని, కాబట్టి హెచ్ఎల్బిలను జాగ్రత్తగా తయారు చేయాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో త్వరలో ప్రారంభం కానున్న జనగణన ప్రక్రియపై జిల్లా కలెక్టర్ సంబంధిత చార్జ్ ఆఫీసర్లు, అదనపు ఛార్జ్ ఆఫీసర్లు, స్టాటిస్టికల్ ఆఫీసర్లు, సాంకేతిక సహాయకులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ వారికి జనగణన ప్రక్రియపై పలు కీలక సూచనలు చేశారు.
కలెక్టర్ మాట్లాడుతూ జన గణన 2027 ప్రక్రియలో భాగంగా మే 11వ తేదీ నుంచి హౌస్ హోల్డ్ ఎన్యుమరేషన్ ప్రారంభమవుతుందని తెలిపారు. కాబట్టి, ఇందులో భాగంగా హౌస్ లిస్టింగ్ బ్లాక్(హెచ్ ఎల్ బీ)లను గుర్తించడం అత్యంత కీలకమని, కాబట్టి హెచ్ ఎల్ బి లను జాగ్రత్తగా తయారు చేయాలని ఆదేశించారు. హెచ్ఎల్బీ లను రూపొందించే క్రమంలో ఒక్క ఏరియా కూడా మిస్ కాకూడదని సూచించారు. అన్ని ఏరియాలు కవర్ అయ్యాయా లేదా అని క్రాస్ చెక్ చేసుకోవాలన్నారు. సెన్సెస్ ప్రక్రియలో పాల్గొనబోయే ఎన్యుమరేటర్లకి ఈనెల 18వ తేదీ నుంచి శిక్షణ ఇవ్వాల్సి ఉంటుందని తెలిపారు. మూడు రోజులపాటు కొనసాగబోయే ఈ శిక్షణకు ఎన్యుమరేటర్లు అందరూ హాజరయ్యే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. ఈనెల 17వ తేదీలోగా ఎన్యుమరేటర్లు అందరికీ శిక్షణకు వచ్చేలా ఉత్తర్వులు జారీ చేయాలన్నారు. వీరి శిక్షణ కోసం సంబంధిత ఛార్జ్ అధికారులు అన్ని ఏర్పాట్లను చేయాలని సూచించారు. 

ఉపాధి హామీ పథకం లక్ష్యాలను సాధించాలి
ఉపాధి హామీ పథకంలో భాగంగా పనిచేస్తున్న కూలీలకి పని ప్రదేశాల్లో కనీస మౌలిక సదుపాయాలను కల్పించాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. కూలీలకి తప్పనిసరిగా త్రాగడానికి నీరు, నిలువ నీడ సౌకర్యాలను కల్పించాలని సూచించారు. అదేవిధంగా ఉపాధి హామీ పథకానికి సంబంధించి లేబర్ పని దినాలతో పాటు, ఇతర లక్ష్యాలను కూడా సకాలంలో సాధించాలని ఎంపిడిఓ లను ఆదేశించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు ఖీమ్య నాయక్, జెడ్పి సీఈఓ యాదయ్య, ఆర్డీవో సుబ్రహ్మణ్యం, డిఆర్డిఓ ఉమాదేవి, సిపిఓ హరికృష్ణ, మాస్టర్ ట్రైనర్లు ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -