Sunday, May 18, 2025
Homeసినిమాసిద్ధాంత పోరాటం..

సిద్ధాంత పోరాటం..

- Advertisement -

కమల్‌ హాసన్‌ కథానాయకుడిగా మణిరత్నం దర్శకత్వంలో రూపొందుతున్న హైలీ యాంటిసిపేటెడ్‌ గ్యాంగ్‌స్టర్‌ డ్రామా ‘థగ్‌ లైఫ్‌’. ఈ సినిమా జూన్‌ 5న థియేటర్లలో విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా చిత్రబృందం శనివారం ట్రైలర్‌ను విడుదల చేసింది. ట్రైలర్‌ ఆరంభం నుంచే నమ్మకద్రోహం, ఈగో కూడిన వరల్డ్‌లోకి ఆడియన్స్‌ని తీసుకెళుతుంది. కమల్‌హాసన్‌ పవర్‌ఫుల్‌ గ్యాంగ్‌స్టర్‌ పాత్రలో అదరగొట్టారు. శింబు, కమల్‌ బాండింగ్‌ కథలో చాలా క్రూషియల్‌గా నిలిచింది. కమల్‌ హాసన్‌ ఫెరోషియస్‌ పాత్రలో కనిపించగా, శింబు పాత్రలో యంగ్‌ ఎనర్జీ ఉంది. ఇది మామూలు రివేెంజ్‌ స్టొరీ కాదు. ఒక సిద్ధాంత పోరాటం. మణిరత్నం ఈ భావోద్వేగ కథని అద్భుతంగా తీర్చిదిద్దారు. రవి కే చంద్రన్‌ సినిమాటోగ్రఫీ అద్భుతంగా ఉంది. ఏఆర్‌ రెహమాన్‌ బీజీఎం ఒక ఎపిక్‌ స్టొరీని వండర్‌ఫుల్‌గా ప్రజెంట్‌ చేసింది. ఎడిటర్‌ శ్రీకర్‌ ప్రసాద్‌ ఎడిటింగ్‌ రేజర్‌షార్ప్‌గా ప్రతి మూమెంట్‌ అత్యద్భుతంగా ఉంది. రాజ్‌ కమల్‌ ఫిలిమ్స్‌ ఇంటర్నేషనల్‌, మద్రాస్‌ టాకీస్‌, రెడ్‌ జెయింట్‌ మూవీస్‌ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్ర నిర్మాణ విలువలు ఉన్నత స్థాయిలో ఉన్నాయి. ట్రైలర్‌ సినిమాపై అంచనాలని భారీగా పెంచింది. థియేటర్లలో గ్రేట్‌ సినిమాటిక్‌ ఎక్స్‌పీరియన్స్‌ అందించనుందని ట్రైలర్‌ చెప్పకనే చెబుతోంది అని చిత్ర యూనిట్‌ తెలిపింది.
హీరో నితిన్‌ ఫాదర్‌ ఎన్‌. సుధాకర్‌ రెడ్డి శ్రేష్ఠ్‌ మూవీస్‌ ద్వారా ఈ సినిమా తెలుగులో విడుదల కానుంది. గతంలో ‘విక్రమ్‌, అమరన్‌’ లాంటి బ్లాక్‌బస్టర్లు అందించిన ఈ సంస్థ ఇప్పుడు ‘థగ్‌ లైఫ్‌’ని భారీగా విడుదల చేయబోతోంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -